ఆస్తుల కేసు మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నారు..: నారా లోకేశ్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

జగన్ చేసిన నేరాలు ఏపీ ప్రయోజనాలకు ఉరి వేస్తున్నాయని మండిపడ్డారు.

ఆస్తుల కేసు మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నారని నారా లోకేశ్ ఆరోపించారు.తమ్ముడిని రక్షించుకునేందుకు పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు.

Special Status Waived For Waiver Of Assets Case..: Nara Lokesh-ఆస్తు�

జగన్ సర్కార్ వైఫల్యం వలనే కృష్ణా జలాల కేటాయింపులపై పున: సమీక్ష జరుగుతోందని తెలిపారు.కృష్ణా జలాల్లో న్యాయబద్దమైన వాటా కోల్పోతే రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు.

ఈ క్రమంలో జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో ఏమేమీ కోల్పోయారో ప్రజలు గుర్తించాలని సూచించారు.

Advertisement
అమెరికాను కాదని ఇండియాలో పిల్లల్ని పెంచుతున్న మహిళ.. ఆమె చెప్పిన 8 కారణాలు తెలిస్తే వావ్ అనాల్సిందే!

తాజా వార్తలు