అయ్యోరిపల్లిలో ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక చర్యలు.. సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు పేర్కొన్నారు.

ప్రస్తుతం వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులతో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు కాపాడుకోవడానికి రాత్రనకా పగలనకా అష్ట కష్టాలు పడుతున్నారని వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోళ్లకు సరిపడ వాహనాలను సమకుర్చుతున్నట్లు వ్యాఖ్యణించారు.ధాన్యం కొనుగోళ్ళలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తడిసిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే తగిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని కృష్ణదేవరావు రైతులకు సూచించారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News