Allu Arjun : ఆ లెక్క ప్రకారం సౌత్ ఇండియాలో అల్లు అర్జున్ నంబర్ వన్ హీరో.. వాళ్ల కంటే టాప్ అంటూ?

దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలలో ఎక్కువ మార్కెట్ ఫ్యాన్స్ బేస్ కలిగిన హీరోలు ఎవరు అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ తర్వాత దలపతి విజయ్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నాయి.మొదటినుంచి సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) పేరు ఎక్కువగా వినిపిస్తుండగా ఈ మధ్యకాలంలో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ టూ ఆయనకు పోటీగా నిలిచాడు హీరో దళపతి విజయ్.

( Vijay Thalapathy ) ఇక ఈ మధ్యకాలంలో రజినీకాంత్ ని దాటేశాడు.73 ఏళ్ల రజనీకాంత్ ప్రస్తుతం తన సినీ కెరియర్ కి చివరి దశలో ఉన్నారు.ఇలాంటి సమయంలో సౌత్ లో తలపతి విజయ్ రజనీకాంత్ స్థానాన్ని రీప్లేస్ చేస్తాడని చాలామంది అనుకున్నారు.కానీ ఎవరు ఊహించని విధంగా విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చేసాడు.2025లో సినిమాలకు పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు.ప్రజెంట్ తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్, విజయ్ లాంటి సౌత్ ఇండియన్ మార్కెట్ మరే హీరోకి లేదు.

ఇక అటు శాండల్ వుడ్ లో చూసుకుంటే యష్( Yash ) కేజీఎఫ్ సిరీస్ తో భారీ క్రేజ్ అందుకున్నాడు.

South Number One Hero Pan India Hero Allu Arjun

కానీ యశ్ నెక్స్ట్ మూవీ పైనే అతని మార్కెట్ ఆధారపడి ఉంది.ఇక మాలీవుడ్ లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన మార్కెట్ ఉన్న పెద్ద హీరోలు ఎవరూ లేరు.దుల్కర్ సల్మాన్ కి( Dulquer Salman ) డీసెంట్ మార్కెట్ ఉన్నప్పటికీ రజినీకాంత్, విజయ్ ల రేంజ్ లో మార్కెట్ లేదు.

టాలీవుడ్ విషయానికి వస్తే, చాలా సినిమాలు హిందీ బెల్ట్ లో భారీ సక్సెస్ అందుకున్నాయి.కానీ తమిళ, మలయాళ మార్కెట్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.

South Number One Hero Pan India Hero Allu Arjun
Advertisement
South Number One Hero Pan India Hero Allu Arjun-Allu Arjun : ఆ లెక్�

ప్రభాస్ లాంటి స్టార్ కూడా ఈ ప్రాంతాల్లో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశాడు.కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) మాత్రం సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మారెందుకు సిద్ధంగా ఉన్నాడు.తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న బన్నీకి కర్ణాటకలో బలమైన మార్కెట్ ఉంది.

అటు మలయాళం లోనూ బన్నీ సినిమాలకు భారీ కలెక్షన్స్ వస్తుంటాయి.ఇక తమిళనాడులో పుష్ప అనూహ్యస్పందన అందుకుంది.

బన్నీ అప్ కమింగ్ మూవీ పుష్ప 2( Pushpa 2 ) ఇండియన్ సినీ హిస్టరీ లోని సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ మూవీ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు.ఈ ప్రాజెక్టుతో తమిళంలో తన మార్కెట్ ని మరింత విస్తరించుకోవడం ఖాయం.

మొత్తంగా రాబోయే రోజుల్లో రజనీకాంత్ తర్వాత సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోగా బన్నీ మారడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు