తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్యఅతిథిగా సోనియాగాంధీ..సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను( Telangana Formation Day ) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో జూన్ 2న జరిగే ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సోనియాగాంధీని( Sonia Gandhi ) ఆహ్వానించినట్లు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వారందరినీ దశాబ్ది వేడుకలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు.ఈ వేడుకలకు రానున్న సోనియాకు పిసిసి అధ్యక్షుడిగా సీఎంగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

రాష్ట్రంలోని ప్రముఖులను ఉద్యమకారులను ఈ వేడుకలలో భాగస్వామ్యం చేస్తామన్నారు.ప్రజా పాలనలో జరుపుకుంటున్న మొదటి ఉత్సవాలు కాబట్టి ఉద్యమకారులను భాగస్వాములను చేస్తామని తెలిపారు.

వారందరికీ సముచిత గౌరవం దక్కుతుందని హామీ ఇచ్చారు.

Sonia Gandhi As Chief Guest For Telangana Formation Day Cm Revanth Reddy Sensati
Advertisement
Sonia Gandhi As Chief Guest For Telangana Formation Day CM Revanth Reddy Sensati

కోదండరాం నేతృత్వంలో జాబితాను తయారు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజల అదృష్టం మేరకు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు.తెలంగాణ( Telangana ) ఇచ్చిన నేతగా సోనియాను ఆహ్వానించినట్లు చెప్పారు.

సోనియా రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక.

ప్రజలకు పండుగ రోజు అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడు ప్రధాని మోదీకి( PM Modi ) పాకిస్తాన్ గుర్తు వస్తుందని విమర్శించారు.

మరి అలాంటప్పుడు పాకిస్తాన్ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు మోదీ పాక్ కి ఎందుకు వెళ్లారు.? పాక్ ప్రధానిని.ఎందుకు కౌగిలించుకున్నారు.? అంటూ ప్రశ్నించారు.ధరల పెరుగుదల, రిజర్వేషన్లు రద్దు చేయడం, రాజ్యాంగాన్ని మార్చటం అంశాలను లేవనెత్తితే బీజేపీకి పాకిస్తాన్ గుర్తుకు వస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

మంత్రులకు తప్పిన పెను ప్రమాదం!
Advertisement

తాజా వార్తలు