Naresh Pavitra Lokesh : కృష్ణ చనిపోతే అలాంటి వేషాలా.. నరేష్ పవిత్రలపై షాకింగ్ కామెంట్స్ వైరల్!

కృష్ణ మరణించి మూడు రోజులు కాగా ఆయన మరణించారనే వార్త ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఎంతో బాధ పెట్టింది.

ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి కృష్ణ చనిపోయిన సమయంలో నరేష్ పవిత్రలపై షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

కృష్ణగారు అంటే నాకు చాలా అభిమానమని కృష్ణ కడసారి చూపుకు నేను వెళ్లిన సమయంలో సీఎం వస్తున్నారని తెలిసి వెనుక ఉన్న పవిత్రను నరేష్ కుటుంబ సభ్యుల మధ్య కూర్చోబెట్టారని ఆమె కామెంట్లు చేశారు.కృష్ణగారు చనిపోయిన సమయంలో కూతుళ్లు చాలా బాధ పడ్డారని ఆమె చెప్పుకొచ్చారు.

నరేష్ పవిత్ర లోకేశ్ ప్రవర్తన వింతగా ఉందని కృష్ణకుమారి పేర్కొన్నారు.వాళ్లను వాళ్లు ప్రపంచానికి చూపించుకోవడానికి ఇది ఒక వేదిక అనే విధంగా బిహేవ్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.

అన్యోన్య జంట అనే విధంగా నరేష్ పవిత్ర తమకు తాము ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నారని కృష్ణకుమారి పేర్కొన్నారు.కృష్ణగారు చనిపోవడం పెద్ద విషయమైతే నరేష్ పవిత్ర ప్రవర్తన మాత్రం కరెక్ట్ కాదని ఆమె వెల్లడించారు.

Advertisement

నరేష్ పవిత్రల ప్రవర్తన చూసేవాళ్లకు చాలా ఎబ్బెట్టుగా అనిపించిందని కృష్ణకుమారి వెల్లడించారు.రమ్య రఘుపతి ముందు నరేష్, పవిత్ర అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు.

పవిత్ర లోకేశ్ తాను ఏదో సాధించాననేలా బిహేవ్ చేశారని కృష్ణకుమారి అన్నారు.

రమ్య రఘుపతి అక్కడ తప్పు చేసినట్టు తల దించుకుందని ఆమె కామెంట్లు చేశారు.నరేష్ పవిత్ర లోకేశ్ తీరుపై చాలామంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

ఈ కామెంట్ల గురించి వీకే నరేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు