కాబోయే భర్తకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన కార్తీక దీపం మోనిత..ధర ఎంతంటే?

బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి శోభ శెట్టి( Sobha Shetty ).

ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ముఖ్యంగా కార్తీక దీపం ( Karthika Deepam ) సీరియల్ లో ఈమె విలన్ మోనిత ( Monitha ) పాత్రలో నటించారు.ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు అనంతరం బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో సుమారు 14 వారాలపాటు హౌస్ లో కొనసాగుతూ సందడి చేశారు.

Sobha Shetty Gives Costly Gift To Her Feance Yaswanth Reddy, Yaswanth Reddy, Sob

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్న సమయంలోనే తన ప్రేమ విషయాన్ని బయట పెట్టారు.బుల్లితెర నటుడు యశ్వంత్ రెడ్డి( Yashwanth Reddy ) అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న సంగతి తెలియడంతో అందరూ కూడా షాప్ అయ్యారు.ఇక వీర ప్రేమ విషయం బయట తెలియడంతో వీరిద్దరూ కలిసి వీరికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు.

Advertisement
Sobha Shetty Gives Costly Gift To Her Feance Yaswanth Reddy, Yaswanth Reddy, Sob

ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శోభ శెట్టి సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకున్నారు.ఇక ఇటీవల వీరిద్దరూ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే.

Sobha Shetty Gives Costly Gift To Her Feance Yaswanth Reddy, Yaswanth Reddy, Sob

ఇలా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా శోభాశెట్టి ప్రియుడు యశ్వంత్ రెడ్డి పుట్టినరోజు కావడంతో శోభా శెట్టి ఊహించని కానుక ఇస్తూ సర్ప్రైజ్ చేశారు.ఈమె తన ప్రియుడు కోసం బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని కొనుగోలు చేసి తనకు కానుకగా అందించారు.ఇక ఈమె కొనుగోలు చేసిన ఈ కారు ఖరీదు సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఉంటుందని సమాచారం.మొత్తానికి ప్రియుడి పుట్టిన రోజుకు కాస్ట్లీ కారునే గిఫ్ట్ గా ఇచ్చిందంటూ నేటిజన్స్ ఈ విషయంపై స్పందిస్తూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు