టూరిస్ట్‌లకు వెన్నులో వణుకు పుట్టించిన పాము.. వీడియో వైరల్

సాధారణంగా పామును ఆమడదూరంలో చూస్తేనే గుండెల్లో భయం పుట్టుకు వస్తుంది.అలాంటిది మనకి ఒక అడుగు దూరంలో పాము సంచరిస్తే.

ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి, కదూ ఇలాంటి భయానక ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వీడియోలు చక్కర్లు కొట్టాయి.అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం మరింత భయానకంగా ఉంది.

ఈ వీడియో చూస్తుంటేనే గుండెల్లో దడ పుట్టుకొస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈ వీడియో ప్రకారం, కొందరు టూరిస్టులు సరదాగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రిషికేశ్‌లోని గంగా నదిపై సాహసోపేతమైన రైడ్‌కు వెళ్లారు.

బోట్‌లో ఎక్కి రివర్ రాఫ్టింగ్ చేస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు.ఈ సమయంలోనే ఒక భారీ పాము నీటిలో ఈత కొడుతూ బోటు వైపుగా వచ్చింది.

Advertisement
Snake That Causes Tremors In The Back Of Tourists Video Goes Viral Viral Latest

చూడటానికి అది చాలా పెద్దగా భయంకరంగా ఉండటంతో సదరు పర్యాటకులు జడుసుకున్నారు.పాము ఎక్కడ బోట్‌ పైకి ఎక్కుతుందేమోనని బాగా బెదిరిపోయి గట్టి గట్టిగా కేకలు వేశారు.

దాంతో ఆ పాము కూడా బెదిరిపోయి తిరిగి వేరే వైపు వెళ్ళింది.అటువైపు కూడా మరో టూరిస్ట్ బోటు ఉండటంతో వారూ భయాందోళనకు గురయ్యారు.

కానీ ఇది ఎవరికీ హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

Snake That Causes Tremors In The Back Of Tourists Video Goes Viral Viral Latest

ఈ షాకింగ్ దృశ్యాలను ఒక టూరిస్ట్ వీడియో తీసి సోషల్ మాధ్యమాల్లో షేర్ చేశారు.దాంతో ఇది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.ఆ పాము పది అడుగులకు పైనే పొడవు ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ షాక్ అవుతున్నారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

వామ్మో ఆ పాము బోటుపైకి ఎక్కినట్లయితే.పర్యాటకుల పరిస్థితి ఏమయ్యేదో.

Advertisement

తలుచుకుంటేనే భయమేస్తోంది అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో రివర్ రాఫ్టింగ్ చేస్తుండగా జరిగింది.

ఈ ప్రాంతంలో ఇటీవలే వాటర్ గేమ్‌లు ప్రారంభమయ్యాయి.

తాజా వార్తలు