Smoking cigarettes : రోజుకి 10 సిగరెట్లు తాగుతున్నారా ? నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెప్పిన నిజాలు..

ప్రపంచ వ్యాప్తంగా ధూమపానం చేసి అనారోగ్యం బారిన పడుతున్న వారు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు.

ఇలా చేసేవారిలో చదువు లేని వారు తక్కువగా ఉన్న, చదువు ఉన్న వారు ఎక్కువ మంది ఉన్నారు.

అంటే దీని అర్థం అన్ని తెలిసి కూడా వీరు ధూమపానం చేసి అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు.ముఖ్యంగా ఇలాంటి చెడు అలవాటు ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

చాలామంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ధూమపానానికి బానిసలు అవుతున్నారు.వీరిలో చాలామంది రోజుకి కనీసం 10 సిగరెట్లు అయినా తాగుతున్నారు.

కానీ వారికి తెలియని విషయమేమిటంటే అలాంటివారు వేగంగా మరణానికి దగ్గరవుతున్నట్లు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకారం ఒక మనిషి రోజుకు 10 కంటే ఎక్కువ సిగరెట్లను తాగినట్లయితే మరణానికి చేరువలో ఉన్నట్లేనని ఎన్‌సీఐ వెల్లడించింది.

Advertisement

ప్రతిరోజు ఎక్కువ గా సీక్రెట్లు తాగినట్లయితే ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉంది.కాస్త కష్టపడితే చాలు ఈ సిగరెట్ తాగే అలవాటును వదిలేయవచ్చు.

ఏదైనా చెడు అలవాటు ఉంటే దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో అనే విషయాన్ని ఆలోచించాలి.సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా ఆ సమయంలో మీకు ఇష్టమైన ఆహారాన్ని తినడం మంచిది.

సిగరెట్ తాగడం మానేయాలనే సంకల్పం గట్టిగా ఉండాలి.

దీనితోపాటు సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు బిగ్గరగా శ్వాస తీసుకుని వదలి, ఆ తరువాత నీరు త్రాగడం మంచిది.ఇలా చేయడం వల్ల కొన్ని చెడు అలవాట్లను వదిలేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.అంతే కాకుండా ఉసిరి, అల్లం పొడి తీసుకుని అందులో నిమ్మరసం, ఉప్పు కలిపి పేస్ట్ చేసి ఉంచుకోవాలి.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

మీకు సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా ఈ పేస్ట్‌ని కొంచెం తినడం అలవాటు చేసుకోవడం వల్ల కూడా చెడు అలవాటులను దూరం చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు