పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి

రాజన్న సిరిసిల్లా జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ వసతిగృహాలు‌,గురుకులాలు, కెజిబివిలు, యూనివర్శీటీలకు గత జూన్ నుండి డైట్ బిల్లును ప్రభుత్వం విడుదల చేయలేదని తక్షణమే డైట్ బిల్లును విడుదల చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న 7200 కోట్లుకు పైగా స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని, అద్దె భవనాలలో నడుస్తున్న గురుకులాలు, కెజిబివిలు, సంక్షేమ వసతిగృహాలకు నూతన భవనాలు నిర్మించాలని తదితర డిమాండ్లతో ఎస్ఎఫ్ఐ రాజన్నసిరిసిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఏవో కి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్లా జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు .

అన్ని రంగాల్లో విద్యారంగం వెనుకబడి ఉంది.కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే గతంలోనే మెస్ ఛార్జీలు పెంచాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పెంచిన మెస్ ఛార్జీలు రాష్ట్రంలో ఇప్పటికీ అమలు కావడం లేదు.ప్రధానంగా రాష్ట్రంలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కెజిబివిలు, ఆశ్రమ పాఠశాలలు, కళాశాల వసతిగృహాలకు మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి.

ఎస్టీ డిపార్ట్మెంట్ కళాశాల వసతిగృహాలకు జూన్ నుండి, ఎస్.సి.డిపార్మెంట్ లో సెప్టెంబర్ నుండి మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి.గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు ఇప్పటికీ జీ.వో.ఇవ్వలేదు.2015 నాటీ ధరలకనుగుణంగా ఇంకా పాత మెనూ అమలు అవుతుంది.ప్రభుత్వం ఎస్.

Advertisement

సీ.మరియు బి.సి.హస్టల్స్ కు ఇస్తున్న కాస్మోటిక్ ఛార్జీలు విద్యార్థులకు 65/-రుపాయాలు, విద్యార్ధీనీలకు -100/- సరిపోవడం లేదు.ఎస్టీ హస్టల్స్ కు ఇస్తున్న ఆయిల్, సబ్బులు కూడా సరిపోడవం లేదు.

వీటిని పెంచి ఇవ్వాలని కోరుతున్నాము.  అద్దె భవనల్లో నడుస్తున్న గురుకులాలు, హస్టల్స్, కెజిబివిలకు స్వంత భవనాలు నిర్మించాలి.

రాష్ట్రంలో గత ఆరెండ్ల నుండి 7200 కోట్లుకు పైగా స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ పెండింగ్ ఉన్నాయి.వాటిని కూడా విడుదల చేయాలి.

ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది.పెరిగిన ధరలకు అనుగుణంగా వసతిగృహాలకు, గురుకులాలకు, కెజిబివిలకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
1962 సంస్థ ఈఎంఆర్ఐ క్రింద జీతాలు లేక ఇబ్బంది పడుతున్న సంచార పశు వైద్యశాల సిబ్బంది

రాష్ట్రంలో పెండింగ్ ఉన్న మెస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలి.హస్టల్స్ రీపేరు భాధ్యత గురుకులాల తరహాలో ఇంజనీరింగ్ డిపార్మెంట్ కు ఇచ్చి అన్నింటీని రీపేరు చేయించాలి.

Advertisement

ప్రస్తుతం ధరలకు అనుగుణంగా మెనూ అమలు జరిపేలా నిధులు ఇచ్చి ప్రిమెట్రిక్ విద్యార్ధులకు నెలకు రూ:2000/- పోస్ట్ మెట్రిక్ విద్యార్ధులకు రూ: 4000/-వృతి విద్యా, యూనివర్శీటీల విద్యార్ధులకు నెలకు రూ 5000/- అందించాలి.పెండింగ్లో ఉన్న 7200 కోట్ల స్కాలర్ షిప్స్, ఫీజురీయంబర్స్ మెంట్స్ తక్షణమే విడుదల చేయాలి.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలి.అద్దె భవనాలలో నడుస్తున్న అన్ని గురుకులాలు, కెజిబివిలు, హస్టల్స్ స్వంత భవనాలు నిర్మించాలి.అగ్రికల్చర్ యూనివర్సిటీ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఇచ్చిన జీవో నం.55 వెనక్కి తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మంద అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్, గుండెల్లి కళ్యాణ్, కుర్ర రాకేష్, జిల్లా నాయకులు వేణు, రాకేష్, కిరణ్, ఆదిత్య, సంతోష్, అరుణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News