కెనడాలో సిక్కు యువకుడిని కాల్చిచంపిన దుండగులు.. పది రోజుల్లో రెండో ఘటన

కెనడాలో భారత సంతతి వ్యక్తులు దారుణ హత్యలకు గురవుతున్నారు.

కొద్దిరోజుల క్రితం బ్రాంప్టన్‌లో ఓ పంజాబీ యువతిని దుండగులు కాల్చిచంపిన ఘటన మరవకముందే మరో సంఘటన చోటు చేసుకుంది.

బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో తన ఇంటిలోనే ఓ 40 ఏళ్ల సిక్కు మహిళను దుండగులు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు.ఇద్ది సద్దుమణగకముందే తాజాగా మరో భారత సంతతి వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు.

మృతుడిని అల్బెర్టా ప్రావిన్స్‌కు చెందిన 24 ఏళ్ల సంరాజ్ సింగ్‌‌గా గుర్తించారు.డిసెంబర్ 3న రాత్రి 8.40 గంటలకు అల్బెర్టా రాజధాని ఎడ్మంటన్ 51 స్ట్రీట్, 13 అవెన్యూ ప్రాంతంలో తుపాకీ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.తీవ్రగాయాలతో పడివున్న సంరాజ్‌ సింగ్‌కు సీపీఆర్ ఇచ్చి అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు పోలీసులు.

డిసెంబర్ 7న ఎడ్మింటన్ మెడికల్ ఎగ్జామినర్ అతని మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేశారు.హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు .ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన వాహనాన్ని గుర్తించి వాటిని మీడియాకు విడుదల చేశారు.

Advertisement

కాగా.ఈ నెల ప్రారంభం నుంచి సిక్కు సంతతికి చెందిన వ్యక్తులు వరుసపెట్టి హత్యలకు గురికావడంతో కెనడాలోని సిక్కు కమ్యూనిటీ ఉలిక్కిపడింది.డిసెంబర్ 3న మిస్సిసాగాలోని గ్యాస్ స్టేషన్ వెలుపల 21 ఏళ్ల పవన్ ప్రీత్ కౌర్ అనే పంజాబీ సంతతికి చెందిన యువతిని దుండగులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది.

ఆ తర్వాత డిసెంబర్ 7న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హర్‌ప్రీత్ కౌర్ అనే 40 ఏళ్ల సిక్కు మహిళను దుండగులు విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు.కెనడాలో నరహత్యల రేటు 2021లో మూడు శాతం పెరిగినట్లు స్టాటిస్టిక్స్ కెనడా చెబుతోంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు