పెళ్లిలో వధువుకు ‘గాడిద’ను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. ఎందుకో తెలుసా!

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.వధువుకు అయినా వరుడికి అయినా అదొక మధురానుభూతి.

జీవితంలో ఒక్కసారి వచ్చే ఆ సుందరసుమధూరమైన క్షణాన్ని ఫోటోలు, వీడియోలు తీసి మరీ గుర్తు పెట్టుకుంటారు.ఆ రోజు గుర్తుండిపోయేలా ఎంత డబ్బైనా ఖర్చు చేసి మరీ గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటారు.

ఇక వధువు తరుపున, వరుడు తరుపున వచ్చే కానుకల విషయంలో అయితే చెప్పనక్కర్లేదు.ఆ రోజు ఇంట్లో గిప్ట్స్ షాప్ పెట్టినట్టే ఉంటుంది.

అందరు ఇచ్చే గిఫ్ట్ ఒకెత్తు అయితే వధువుకు వరుడు వరుడికి వధువు ఇచ్చే కానుకలు మరీ ప్రత్యేకం.ఇచ్చే మొదటి గిఫ్ట్ కాబట్టి క్యూరియాసిటీ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది.

అయితే పెళ్లిలో వరుడు కాబోయే అమ్మాయికి ఇచ్చిన గిప్ట్ బలే ఫన్నీగా వింతగా విడ్డూరంగా ఉంది.

పెళ్లిళ్లకు హాజరయ్యేటప్పుడు నూతన వధూవరులకు కట్నకానుకలు అందించడం కామన్‌.

కానీ ఇందుకు భిన్నంగా పెళ్లి మండపంలోనే ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యకు వినూత్న గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు.ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది.అజ్లాన్ అనే వ్యక్తి వరిషా అనే యువతిని పెళ్లాడాడు.పెళ్లిమండంలోనే వధువుకు ఓ బహుమతి ఇవ్వాలని అజ్లాన్‌ నిర్ణయించుకున్నాడు.

దీంతో వరుడు వధువుకి ఓ గాడిద పిల్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు.దానిని చూసిన వధువు షాక్‌ అవ్వలేదు.

ఎందుకంటే అతనికి ముందే తెలుసు వధువు జంతు ప్రేమికురాలని.అందుకే చిన్న గాడిద పిల్లను ఆమెకు వివాహ కానుకగా ఇవ్వాలనున్నట్లు వరుడు అజ్లాన్‌ చెప్పాడు.

కాబోయే భార్యకు ఈ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చే సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను వరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో ఈ విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

వీడియోలో పెళ్లిలో బహుమతిగా ఈ గాడిదను ఎందుకు ఎంచుకున్నావు అని వధువు అడిగితే ఒకటేమో అదంటే నీకు ఇష్టం, రెండోది గాడిద అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టపడే, అత్యంత ప్రేమగా ఉండే జంతువు అని వరుడు బదులిచ్చాడు.

అంతేగాక గాడిద పిల్లను దాని తల్లి నుంచి వేరు చేయలేదని.తల్లి కూడా ఈ పిల్ల గాడిదతోనే ఉందని తెలిపాడు.తనకు జంతువులు అంటే చాలా ఇష్టమని, జనాలు ఏమైనా అనుకోనివ్వండి.

వారిశాకు ఇదే నా బహుమతి అంటూ పేర్కొన్నాడు.అజ్లాన్ మాటలు విన్న వధువు వారిశా తాను దీన్ని కేవలం గాడిదలా చూడటం లేదని తెలిపింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.ఊహించని గిఫ్ట్‌ను చూసి కొందరు నవ్వుతుంటే.మరికొందరు మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు.ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని నూతన జంటకు శుభాకాంక్షలు తెలపుతున్నారు.

అలాగే గాడిద పిల్ల కూడా క్యూట్‌గా అందంగా ఉందంటూ, ఎవరు ఏమనుకుంటారనే దాని గురించి పట్టించుకోవద్దని కామెంట్‌ చేస్తున్నారు.కానీ ఇలా ఆమె ఇష్టాన్ని అర్థం చేసుకొని ఆమెకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గిఫ్ట్ ప్లాన్ చేసిన అతన్ని పొగడకుండా ఎవరు ఉండడం లేదు.

దానికి తదుపరి ఖర్చు అయినా దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా తన మీదనే ఉంటుంది అయినా కూడా అదేం పట్టించుకోకుండా వరుడు ఆ గిఫ్ట్ ప్లాన్ చేయడం గ్రేట్ కదా…మీరు కూడా మీకు కాబోయే వాళ్లైనా లేదా మీకు ఇష్టమైనా వాళ్లకు ఇలానే ఏదైనా ఇష్టుముంటే మంచి సందర్భం చూసి ఓ గిప్ట్ ఇచ్చేయండి.నిజానికి గిఫ్ట్ అవసరం లేదు అనుకుంటారు కానీ చిన్న గిప్ట్ అయినా సరే గుర్తు పెట్టుకొని ఇస్తే వారి ఇష్టాలను తెలుసుకుంటే ఎదుటి వ్యక్తి వచ్చే సంతోషమే వేరు.

అది అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా ఏమంటారు….

Pakistani Man gifts baby donkey to his bride in wedding

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube