డ్రగ్స్ అక్రమ రవాణా.. కెనడాలో సిక్కు డ్రైవర్‌కు 15 ఏళ్లు జైలు, భారత్‌ పారిపోయిన నిందితుడు

60 ఏళ్ల సిక్కు ట్రక్ డ్రైవర్‌( Sikh Truck Driver ) కోసం కెనడా వ్యాప్తంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

డ్రగ్స్ అక్రమ రవాణా( Smuggling Drugs ) చేసినందుకు 15 ఏళ్ల జైలుశిక్ష పడిన అనంతరం అతను భారతదేశానికి పారిపోయాడు.కెనడా - యూఎస్ పసిఫిక్ హైవే బోర్డర్ క్రాసింగ్ ద్వారా బ్రిటీష్ కొలంబియాలోకి 80 కిలోల కొకైన్‌ను అక్రమంగా రవాణా చేసినందుకు సర్రేకు చెందిన రాజ్ కుమార్ మెహ్మీకి( Raj Kumar Mehmi ) నవంబర్‌లో కోర్ట్ శిక్ష విధించింది.దీంతో మెహ్మీని గుర్తించి .తక్షణం అరెస్ట్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా వున్న లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించేలా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసును కోరుతున్నట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) బుధవారం వెల్లడించింది.

రాజ్‌కుమార్‌ను తొలుత నవంబర్ 6, 2017న బ్రిటీష్ కొలంబియా ఆర్‌సీఎంపీ అరెస్ట్ చేసింది.80 సీల్డ్ కొకైన్ ఇటుకలను సెమీ ట్రయిలర్ ట్రక్కులో దాచిపెట్టి ప్రయాణిస్తున్న మెహ్మీ గురించి కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ)( Canada Border Services Agency ) అప్రమత్తం చేసింది.పోలీసులు అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ అప్పట్లో 3.2 మిలియన్ డాలర్లని అంచనా.నియంత్రిత డ్రగ్స్ అండ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (సీడీఎస్ఏ) కింద మెహ్మీపై పలు అభియోగాల కింద నేరాన్ని నమోదు చేశారు.

సెప్టెంబర్ 6, 2022న సుప్రీంకోర్టు రెండు ఆరోపణలపై మెహ్మీని దోషిగా నిర్ధారించింది.జనవరి 9, 2023న విచారణను షెడ్యూల్ చేశారు.

అక్టోబర్ 11, 2022న మెహ్మీ.వాంకోవర్( Vancouver ) నుంచి విమానంలో భారత్‌కు పారిపోయి.మరుసటి రోజు న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆర్‌సీఎంపీ తెలిపింది.

నవంబర్ 16న బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రావిన్షియల్ కోర్ట్ శిక్షను విధించింది.అరెస్ట్ సమయంలో మెహ్మీ నుంచి కెనడా పాస్‌పోర్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే అరెస్ట్, విచారణ మధ్య ఎక్కువ సమయం వుండటంతో అతను కెనడా పాస్‌పోర్ట్ ద్వారా మరో పాస్‌పోర్ట్‌ను పొందగలిగాడు.దాని సాయంతోనే రాజ్ కుమార్ భారత్‌కు పారిపోయాడని ఆర్‌సీఎంపీ తెలిపింది.

నిందితుడు ఆరు అడుగుల పొడవు, 200 పౌండ్ల బరువు వుంటాడని అతని గురించి తెలిస్తే దగ్గరిలోని పోలీస్ అధికారులను సంప్రదించాలని ఆర్‌సీఎంపీ కోరింది.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

తాజా వార్తలు