దేవుడికి నైవేద్యంగా చిత్రాన్నం సమర్పించడంవల్ల ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా చిత్రాన్నం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా పెడుతుంటారు.

అదే విధంగా మహిళలు చేసే ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాలలో ఎక్కువగా చిత్రాన్నం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.

ఈ విధంగా నైవేద్యం సమర్పించడం వల్ల కలకాలం వారు ముత్తయిదువులుగా ఉంటారని భావిస్తుంటారు.ఈ విధంగా సౌభాగ్యం కోసం చేసే పూజలు వ్రతాలలో పండ్లు ప్రసాదాలు భగవంతునికి సమర్పించి వాయనం ఇస్తుంటారు.

అందులో ఒకటే ఈ చిత్రాన్నం.చిత్రాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించి శుక్రవారం ముత్తైదువులకు దానం చేయడం వల్ల మాంగల్య దోషాలు తొలగిపోతాయని భావిస్తారు.

అదేవిధంగా లక్ష్మీనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్రాన్నం నైవేద్యంగా సమర్పించాలి.అనంతరం వృద్ధ దంపతులైన బ్రాహ్మణులను మొదటగా ఇంటికి ఆహ్వానించి వారికి చిత్రాన్నం వడ్డించి భోజనం తర్వాత పండ్లు, తాంబూల దక్షణం ఇచ్చి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల దాంపత్య జీవితంలో ఏర్పడిన కలహాలు, కలతలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు.

Significance Of Chitrannam In Pooja As Offering To God , Temples, God, Chitranna
Advertisement
Significance Of Chitrannam In Pooja As Offering To God , Temples, God, Chitranna

శక్తి దేవతలైన అమ్మవారికి మంగళవారం సాయంత్రం ఈ చిత్రాన్నం నైవేద్యంగా సమర్పించాలి.ఈ విధంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చిత్రానాన్ని తర్వాత ముత్తయిదువులకు మాత్రమే పంచాలి.ఈ విధంగా చేయటం ద్వారా కుజదోషాలు సైతం తొలగిపోతాయి.

అయితే ఎవరికైతే కుజదోషం ఉంటుందో వారు ఈ నైవేద్యాన్ని తినకూడదు.ఈ విధంగా చేయడం వల్ల కుజదోషం తొలగిపోయి పెళ్లి కాని వారికి పెళ్లి ఘడియలు దగ్గర పడతాయి.

ధనుర్మాసంలో దేవాలయాల్లో పూజలు చేయించి, చిత్రాన్నం నివేదించి ప్రసాదాన్ని పంచి తాము కూడా తినడం వల్ల ఇంటి యజమానికి దీర్ఘాయుష్షు ఉంటుందని పండితులు చెబుతున్నారు.అందుకే దేవాలయాలలో ఎక్కువగా చిత్రానాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు