ఆరోగ్యానికి మంచిదని చక్కెర బదులు బెల్లాన్ని ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు ఖాయం!!

బెల్లం ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.చెరుకు రసం నుంచి తయారయ్యే బెల్లం( jaggery ).

చక్కెరకు ఉత్తమమైన ప్రత్యామ్నాయం.ఇటీవల కాలంలో ఆరోగ్యం పై శ్రద్ధ తో చాలా మంది చక్కెర వాడకం తగ్గించేశారు.

చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుతున్నారు.ఆరోగ్యపరంగా బెల్లం అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేయడంలో, మెటబాలిజం రేటును పెంచడంలో, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, రక్తహీనతను తరిమి కొట్టడంలో, శరీరానికి శక్తిని అందించడంలో, రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో బెల్లం చాలా అద్భుతంగా సహాయపడుతుంది.అయితే ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా అని కొందరు బెల్లాన్ని అధికంగా వాడుతుంటారు.

Advertisement
Side Effects Of Eating Jaggery Too Much! Jaggery, Jaggery Health Benefits, Jagge

ఈ అలవాటు మీకు కూడా ఉంటే వెంటనే వదులుకోండి.అతి అనర్థాలకు చేటు.

ఇందుకు బెల్లం కూడా మినహాయింపు కాదు.అధికంగా బెల్లాన్ని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.

శుద్ధి చేసిన తెల్ల చక్కెర కంటే బెల్లం మనకు చాలా మంచిది.కానీ అధికంగా బెల్లం తింటే కేలరీలు పెరుగుదలకు దారితీస్తుంది .ఫలితంగా అధిక బరువు బారిన పడతారు.

Side Effects Of Eating Jaggery Too Much Jaggery, Jaggery Health Benefits, Jagge

అలాగే బెల్లం వేడిని కలుగజేస్తుంది.అధిక మొత్తంలో బెల్లం తీసుకున్నప్పుడు కొందరికి ముక్కులో మంచి రక్తస్రావం( Bleeding ) అవుతుంటుంది.బెల్లంలో అనేక పోషకాలతో పాటు సుక్రోజ్ కూడా ఉంటుంది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

కాబట్టి ఎటువంటి లిమిట్ లేకుండా బెల్లం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి.మధుమేహం బాధితులకు ఇది చాలా ప్రమాదకరం.(

Side Effects Of Eating Jaggery Too Much Jaggery, Jaggery Health Benefits, Jagge
Advertisement

బెల్లాన్ని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు త‌లెత్తుతాయి.వాస్త‌వానికి బెల్లంలో అధిక మొత్తంలో ఫైబర్ ( Fiber )ఉంటుంది.జీర్ణ‌క్రియ‌కు ఫైబ‌ర్ ఎంతో అవ‌స‌రం అయితే అదే ఫైబ‌ర్ ఎక్కువ మొత్తంలో శ‌రీరంలోకి చేరితే మ‌ల‌బ‌ద్ధ‌కం, అతిసారం, కడుపు నొప్పి సమస్యలు కలుగుతాయి.

అంతేకాదు బెల్లాన్ని ఓవ‌ర్ గా తీసుకోవ‌డం వ‌ల్ల‌ అలసట, తలనొప్పి, వికారం, చ‌ర్మంపై ద‌ద్దుర్లు వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌!!.

తాజా వార్తలు