మీరు ఐస్ క్రీమ్ ప్రియులా.. రెగ్యులర్ గా తింటారా.. అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!

ఐస్ క్రీమ్( Ice Cream ) అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఫుడ్స్ లో ఐస్ క్రీమ్ ముందు వరుసలో ఉంటుంది.

అందులోనూ ప్రస్తుత సమ్మర్ సీజన్ లో ఐస్ క్రీమ్స్ ను తెగ లాగించేస్తుంటారు.ఇక సీజన్ తో పని లేకుండా రెగ్యులర్ గా తినేవారు కూడా ఉంటారు.

ఇలాంటి వారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకోవాలి.ఎంత ఐస్ క్రీమ్ ప్రియులైన సరే రెగ్యులర్ గా తింటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఐస్ క్రీమ్ టేస్ట్ గా ఉంటుంది.కానీ ఎన్నో సమస్యలను మోసుకొస్తుంది.

Advertisement

ఐస్ క్రీమ్స్ లో కొవ్వు, క్యాలరీలు, షుగర్స్ చాలా అధిక మొత్తంలో ఉంటాయి.ఇది మన ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడు చేస్తాయి.

రెగ్యులర్గా ఐస్ క్రీమ్ తీసుకుంటే శరీర బరువు అదుపు తప్పుతుంది.బాడీలో క్యాలరీలు భారీగా పెరిగిపోతాయి.

దాంతో ఊబకాయం ( Obesity ) బారిన పడే అవకాశాలు రెట్టింపు అవుతాయి.

అలాగే నిత్యం ఐస్ క్రీమ్ ను తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.ఇది ధమనుల్లో అడ్డంకిని కలిగిస్తుంది.ఫలితంగా గుండెపోటు తో( Heart Attack ) సహా తదితర గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

మీరు రోజూ ఐస్ క్రీమ్ ను తింటూ ఉంటే పాతిక ముప్పై ఏళ్లకే మధుమేహం( Diabetes ) బారిన పడతారు.దాంతో ఐస్ క్రీమ్ తో సహా మరే స్వీట్స్ ను తినలేరు.

Advertisement

ప్రతిరోజు ఐస్ క్రీమ్ ను లాగించేస్తే దంతాలు చిగుళ్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.

దంతాలు పుచ్చిపోవడం లేదా బలహీనంగా మార‌డం, చిగుళ్ల వాపు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం తదితర సమస్యలన్నీ తలెత్తుతాయి.రెగ్యులర్ గా ఐస్ క్రీమ్ ను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మంద‌గిస్తుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి క్రమంగా తగ్గిపోతాయి.

బద్దకం పెరిగిపోతుంది.బెల్లీ ఫ్యాట్ సమస్య ఏర్పడుతుంది.

చర్మంపై మొటిమలు సైతం ఎక్కువగా వస్తుంటాయి.కాబట్టి ఎంత ఐస్ క్రీమ్ ప్రియులైన సరే రెగ్యులర్ గా తింటే మాత్రం మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్న వారు అవుతారు.

కాబట్టి వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి మాత్రమే ఐస్ క్రీమ్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు