ఏ ఆడది చేయకూడని తప్పు చేశాను.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో షావుకారు జానకి ఒకరనే సంగతి తెలిసిందే.తెలుగుతో పాటు ఇతర భాషల్లో షావుకారు జానకి 370కు పైగా సినిమాలలో నటించి ఆ సినిమాలతో సక్సెస్ లను అందుకున్నారు.

200 కంటే ఎక్కువ సినిమాలలో హీరోయిన్ గా నటించిన షావుకారు జానకి హీరోయిన్ గా కూడా సత్తా చాటారు.షావుకారు అనే సినిమాతో నటిగా ఈమె కెరీర్ మొదలైంది.

ఈమె సత్య సాయిబాబా భక్తురాలు కావడం గమనార్హం.షావుకారు జానకి ఎన్నో రంగస్థల నాటకాలలో నటించి ఆ సినిమాలతో కూడా సత్తా చాటారు.

ఒక ఇంటర్వ్యూలో షావుకారు జానకి మాట్లాడుతూ దేవదాసు సినిమాలో ఛాన్స్ వచ్చి పది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత తీసేశారని ఆమె తెలిపారు.నాకు ఎలాంటి రోల్స్ నప్పుతాయో అవే ఇచ్చేవారని ఆమె తెలిపారు.

Advertisement

నా విషయంలో అన్నీ నేనేనని షావుకారు జానకి పేర్కొన్నారు.

నేను ఆరోగ్యం బాలేక పుట్టింటికి వెళ్లిన సమయంలో డిఫరెన్స్ ఫీల్ అయ్యానని ఆమె కామెంట్లు చేశారు.పెళ్లైన తర్వాత పుట్టింటికి వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అర్థమైందని ఆమె తెలిపారు.ఏ ఆడది చేయకూడని తప్పు పుట్టింటికి వెళ్లి అక్కడ ఉండటమని ఆ తప్పు నేను చేశానని షావుకారు జానకి కామెంట్లు చేశారు.

వెరీ లవింగ్ పేరెంట్స్ ఉంటే మాత్రమే పుట్టింటికి వెళ్లాలని షావుకారు జానకి అన్నారు.

ఒకసారి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అత్తారింటికి పరిమితం కావాలని ఆమె అన్నారు.మనం ఎవరూ కూడా గుర్తించలేని పరిస్థితులు కూడా రావచ్చని షావుకారు జానకి అన్నారు.నాకు ఇండివిడ్యువాలిటీ ఎక్కువని కామెంట్లు వినిపించేవని ఆమె కామెంట్లు చేశారు.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

నాకు అవకాశాలు చాలా అరుదుగా వచ్చేవని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.షావుకారు జానకి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు