యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం.. సీతారామం డైలాగ్ వెనుక అర్థం ఇదే!

2022 సంవత్సరంలో క్లాసిక్ హిట్ గా నిలిచి ప్రేక్షకాదరణ పొందిన సినిమాలలో సీతారామం ఒకటి.

అటు కమర్షియల్ గా ఇటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చిన సినిమాగా సీతారామం నిలిచింది.

ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా ఓటీటీలో కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం గమనార్హం.ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థమైనా కానట్టు ఉన్నాయనే సంగతి తెలిసిందే.

సినిమాలో కురుక్షేత్రంలో రావణ సంహారం యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అనే డైలాగ్ ఉంటుంది.చాలామందికి ఈ డైలాగ్ నచ్చినా ఈ డైలాగ్ మీనింగ్ అర్థం కాక ఇబ్బంది పడ్డారు.

సీతారామం సినిమా కథను ఈ డైలాగ్ ద్వారా చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించారు.సీతారామం సినిమాలో హీరోహీరోయిన్ పాత్రలు రెండు వర్గాల మధ్య గొడవ జరిగే సమయంలో కలుసుకుంటారు.

Advertisement

ఈ గొడవను దర్శకుడు కురుక్షేత్రంగా అభివర్ణించారు.

రావణ సంహారం అంటే రామ్ పాత్ర పోషించిన హీరో కుట్రను బయటపెట్టి ఘర్షణ జరగకుండా చూస్తాడు.అందువల్ల దర్శకుడు కురుక్షేత్రంలో రావణ సంహారం అనే డైలాగ్ ను వాడారు.యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అంటే సీత రామ్ ను తొలిసారి కాగడాల వెలుగులో చూస్తాడు.

అప్పుడే సీత రామ్ ను తన భర్తగా నిర్ణయించుకున్నారు.ఈ డైలాగ్ నుంచి యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అనే డైలాగ్ పుట్టింది.

ఈ డైలాగ్ యొక్క అర్థం తెలిసి హను రాఘవపూడి తెలివికి హ్యాట్సాఫ్ అని నెటిజన్లు చెబుతున్నారు.సీతారామం సినిమా ఇప్పటికీ పలు థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

సీతారామం సక్సెస్ తో ఈ కాంబినేషన్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ లకు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు