ఏజెంట్ కోసం అంత బడ్జెట్ పెట్టేస్తున్నారా..!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరియర్ లో మొదటి కమర్షియల్ సక్సెస్ అందుకున్న అక్కినేని హీరో అఖిల్ తన నెక్స్ట్ సినిమా ఏజెంట్ తో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు.

సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాను ఏకె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం మనాలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది.ఈ సినిమా కోసం దాదాపు 80 కోట్ల ఆకా బడ్జెట్ పెట్టేస్తున్నారని టాక్.

Shocking Budget For Akhil Agent Movie , Agent , Agent Budget , Akhil , Akkinen

కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవకూడదని నిర్మాత ఫిక్స్ అయ్యారట.అందుకే ఏజెంట్ సినిమా కోసం 80 కోట్లకి అటు ఇటుగా బడ్జెట్ కేటాయిస్తున్నారట.

అయితే కెరియర్ లో కేవలం ఒకే ఒక్క హిట్ ఉన్న అఖిల్ కోసం ఇంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అంటున్నారు కొందరు.అయితే సినిమా అనుకున్న అంచనాలు అందుకుంటే ఈ బడ్జెట్ పెద్ద లెక్కేమి కాదని చిత్రయూనిట్ చెబుతున్నారు.

Advertisement

అంతేకాదు అఖిల్ ఏజెంట్ సినిమా సెట్స్ మీద ఉండగానే బిజినెస్ కి భారీ రేటు వస్తుందని అంటున్నారు.మొత్తానికి అఖిల్ ఏజెంట్ సినిమాతో తన రేంజ్ పెంచుకోవడం ఖాయమని తెలుస్తుంది.

ఈ సినిమాలో మళయాళ స్టార్ మమ్ముట్టి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు