కోదాడలో బీఆర్ఎస్ కు షాక్.. మూకుమ్మడిగా నేతల రాజీనామా

సూర్యాపేట జిల్లా కోదాడలో అధికార పార్టీ బీఆర్ఎస్ షాక్ తగిలింది.నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు.

మాజీ ఎమ్మెల్యే చందర్ రావుతో పాటు ముగ్గురు ఎంపీపీలు, ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది.అదేవిధంగా సీనియర్ నేత ఎర్నేని వెంకటరత్నం బాబు, పాండు రంగారావు, మహబూబ్ జానీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు అంతా కలిసి పార్టీని వీడారు.

Shock To BRS In Kodada.. En Masse Resignation Of Leaders-కోదాడలో �

కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య ఓటమే తమ లక్ష్యమని నేతలు చెబుతున్నారు.సొంత పార్టీ నాయకులపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టించారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తామంతా పార్టీని వీడుతున్నట్లు తెలిపారని సమాచారం.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి12, బుధవారం 2025

తాజా వార్తలు