ఓటీటీలు వాటి వెంట పరిగెత్తడం మానేయాలి.. శివాజీ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి నటుడు శివాజీ( Shivaji ) గురించి పరిచయం అవసరం లేదు.

ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్నారు.

ఇక బిగ్ బాస్ వెళ్లడానికి ముందు శివాజీ 90s అనే వెబ్ సిరీస్ లో నటించారు .ఇక ఈ వెబ్ సిరీస్ ఈయన బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత విడుదలైంది.ఈ సిరీస్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా శివాజి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఓటీటీ( OTT ) ప్లాట్‌ఫామ్స్ థ్రిల్లర్‌ల వెంట వెళ్లడం మానేసి కామెడీతో కూడిన ఫ్యామిలీ షోలను రూపొందించాలనేది నా అభిప్రాయం.

ఎందుకంటే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలను( Thriller Movies ) తీయడం చాలా సులువైన పని అని ఈయన తెలిపారు.

Advertisement

మన లైఫ్‌ను స్క్రీన్‌పై చూపించడం పెద్ద విషయం.అవే ఆడియన్స్‌కి బాగా నచ్చుతాయి.అందుకే వాటికి రీచ్ ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం చాలా ఓటీటీలు కొరియన్ షోల ప్రభావం( Korean Shows )తో థ్రిల్లర్‌ల వెంట పరిగెత్తుతున్నాయి.ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తే మనకు వినోదం అందించే సినిమాలు ఈ మధ్యకాలంలో తక్కువ అయ్యాయని ఎక్కువగా మర్డర్ చేసిన సినిమాలు కనిపిస్తున్నాయని శివాజీ తెలిపారు.

ఇలాంటివి కాకుండా ఎంటర్టైన్మెంట్ సినిమాలు కనక చేస్తే ఇంటిల్లిపాది కూర్చుని ఎంతో చక్కగా వాటిని చూసి సంతోషిస్తారు అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు