కంగనా వ్యాఖ్యలపై సేన గరం గరం...క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్

సుశాంత్ ఆత్మహత్య ఘటన తరువాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్, శివసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే.

దీనితో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఘాటుగానే స్పందిస్తూ వచ్చింది.

ముంబై మహానగరం మరో పీవోకే తో పోల్చుతూ కామెంట్స్ చేసింది.ఆమె వ్యాఖ్యలపై సేన వర్గం గరం గరంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Shiva Sena Demands To Kangana Should Apologise To Maharashtra , Shiva Sena, Kang

ఈ క్రమంలోనే ఆమెను పీవోకే కె పంపండి ముంబై లో అడుగుపెట్టనివ్వం అంటూ సేన నేతలు మండిపడ్డారు.అయితే కంగనా మాత్రం పబ్లిక్ గా సవాల్ విసిరింది.

సెప్టెంబర్ 9 న నేను ముంబై కి వస్తున్నాను దమ్ముంటే ఆపండి అంటూ సవాల్ విసిరింది.ఇప్పటికే ఈ వ్యవహారంలో జాతీయ మహిళా కమీషన్ కూడా కంగనా కె సపోర్ట్ చేసింది కూడా.

Advertisement

అయితే సేన వర్గం మాత్రం కంగనా మహారాష్ట్రను అవమాన పరచింది అని ముందుగా ఆమె మహారాష్ట్రకు క్షమాపణలు చెప్పాలి అంటూ సేన వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.ఎంపీ సంజయ్ రౌత్ కూడా కంగనాకు క్షమాపణలు చెప్పాలి అని అంటున్నారు ముందుగా ఆమె మహారాష్ట్రకు క్షమాపణలు చెబితేనే తాను ఆమెకు క్షమాపణలు చెప్పడం గురించి ఆలోచిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు.

ముంబైని మినీ పాకిస్తాన్ గా పిలిచిన ఆమె అహ్మ‌దాబాద్ గురించి అలానే మాట్లాడే ధైర్యం ఉందా అంటూ ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు