మరో వివాదంలో చిక్కుకున్న శిల్పాశెట్టి.. సమన్లు జారీ చేసిన ముంబై కోర్టు?

బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఈ మధ్య కాలంలో వరుస వివాదాలతో సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే గత కొన్ని నెలల క్రితం తన భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కంటెంట్ ఉన్న చిత్రాలను ఎన్నో వెబ్ సైట్లకు అమ్ముతూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం బీటౌన్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

సుమారు రెండు నెలల పాటు జైల్లో ఉన్న రాజ్ కుంద్రా ప్రస్తుతం బెయిల్ పై బయటికి వచ్చారు.ఇదిలా ఉండగా తాజాగా శిల్పా శెట్టి మరో వివాదంలో చిక్కుకున్నారు.

రుణ ఎగవేత ఆరోపణల కారణంగా శిల్పాశెట్టి తన సోదరి షమితా శెట్టి, తల్లి సునంద శెట్టిలకు కోర్టు సమన్లు జారీ చేసింది.శిల్పాశెట్టి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కోసం 2015లో తను ఇరవై ఒక్క లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చానని ఓ వ్యాపారి వీరిపై ఆరోపణలు చేశారు.

అయితే ఈ అప్పు 2017 జనవరిలోనే చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు చెల్లించలేదు.

Shilpa Shetty Involved In Another Controversy Mumbai Court Given Noti Shilpa She
Advertisement
Shilpa Shetty Involved In Another Controversy Mumbai Court Given Noti Shilpa She

ఇక శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి మరణించిన తర్వాత అసలు ఆ అప్పుకు తమకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని ఆ అప్పును తిరిగి చెల్లించడానికి శిల్పాశెట్టి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారని వ్యాపారి పర్హద్ అమ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దీంతో అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు శిల్పా శెట్టి కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేసింది.ఈ విధంగా శిల్పాశెట్టి ఒక వివాదం తర్వాత మరొక వివాదంలో చిక్కుకొని తీవ్ర సతమతమవుతున్నారని చెప్పవచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు