యాచించే ఆమే కానీ మనసు బంగారం.. నెటిజన్లను ఏడిపించేస్తున్న వీడియో!

మానవత్వం, మంచితనం, పరుల బాధలను అర్థం చేసుకునే గొప్ప మనసు సూటు బూటు వేసుకుని రాజ భవనాల్లో నివసించే వారి కంటే పేదవారికే ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు.

తమ వద్ద ఏమీ లేకపోయినా గొప్ప మనసు చేసుకొని తమకు చేతనైనంత సహాయం చేస్తుంటారు వీరు.

ఈ విషయం ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది.తాజాగా ఆ నిజం మరోసారి ప్రూవ్ అయింది.

దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.ఈ వీడియో చూసి నెటిజన్లు బాగా ఎమోషనల్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.ఒక హోమ్ లెస్ మహిళ ఒక పబ్లిక్ ప్లేస్‌లో కూర్చొని తనకు సహాయం చేయాలని ఒక ప్లకార్డు ద్వారా యాచించడం చూడవచ్చు.

Advertisement

హోమ్‌ లెస్ పీపుల్ బాధలు అందరికీ తెలిసినవే.అందుకే కొందరు కరుణించి ఆమెకు ఎంతో కొంత సహాయం చేస్తూ వెళ్తున్నారు.

అదే సమయంలో ఒక యువకుడు ఆమె వద్దకు వెళ్లి ఏదో చెప్పాడు.బహుశా తనకు బాగా ఆకలవుతుందని అతడు చెప్పి ఉంటాడు.

దాంతో ఆ హోమ్ లెస్ మహిళ మరో ఆలోచన లేకుండా వెంటనే అతడికి తన వద్ద ఉన్న డబ్బులు ఇచ్చేసింది.అలానే మరింత డబ్బులు ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకుంది.

అలా ఆమె తన పరిస్థితి ఏం బాగోలేకపోయినా అతడికి ఆర్థిక సహాయం చేసింది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

దాంతో ఆ యువకుడు సంతోషించి ఆమె చేతిలో ఒక ఎన్వలప్ పెట్టి వెళ్లిపోయాడు.అందులో ఏముందోనని మహిళ ఓపెన్ చేసి చూసింది.దాంట్లో కొన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి.

Advertisement

నిజానికి ఆమె దానం చేసింది కాయిన్స్ లోనే! కాకపోతే ఏమీ లేకపోయినా, అసలు ఇల్లే లేకపోయినా ఆమె అడగగానే దానం చేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది.అంత మంచి మనసున్న ఆమెకు చాలా డబ్బులు ఇవ్వడంలో తప్పేం లేదని ఆ యువకుడు అదే పని చేశాడు.

అంత డబ్బు చూడగానే ఒక్కసారిగా ఆమె ఎమోషనల్ అయ్యింది.కంటతడి కూడా పెట్టుకుంది.తర్వాత ఆ యువకుడు వద్దకు వెళ్లి హత్తుకుని కృతజ్ఞతలు చెప్పుకుంది.

ఆమె అంత ఎమోషనల్ కావడానికి కారణం ఆమె చాలా బాధల్లో ఉండటమే అని చెప్పవచ్చు.అన్ని బాధల్లో ఉన్నా తన వంతు సహాయం చేయడమే ఆమె మంచి మనసుకి మచ్చుతునక.

ఈ హార్ట్ టచింగ్ వీడియోను @Gulzar_sahab యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.దీన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మీరు కూడా దీనిపై లుక్కేయండి.

తాజా వార్తలు