నానిని చూడగానే ఏడుపొచ్చింది.. నాని పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ హీరో?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ.ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందు కుంది.

ఈ క్రమంలోని ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు.తెలుగులో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీలో కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

హిందీలో ఈ చిత్రంలో నటుడు షాహిద్ కపూర్ నటించారు.షాహిద్ కపూర్ ఎన్నో విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించు కున్నారు.

  ఈ క్రమంలోని ఈయన జెర్సీ సినిమా రీమేక్ చిత్రంలో నటించారు.అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల ఈ సినిమా వాయిదా పడింది.

Advertisement

ఇక ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టు కుందని చెప్పాలి.ఇక ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు షాహిద్ కపూర్ హీరో నాని పై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.జెర్సీ సినిమాలో నాని నటన ఎంతో అద్భుతంగా ఉంది.

ఆయన నటనతో నన్ను ఏడిపించారు.ఈ సినిమాలో నాని నటనను చూసి ఏడ్చానని.

నేను ఈ సినిమా చేయడానికి కారణం నాని అంటూ షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు.తెలుగులో రెండు జాతీయ అవార్డులు దక్కించు కున్న ఈ సినిమా హిందీలో ఎలాంటి విజయాన్ని అందు కుంటుందో తెలియాల్సి ఉంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

హిందీలో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

Advertisement
" autoplay>

తాజా వార్తలు