శతమానం భవతి మూవీ రివ్యూ

చిత్రం :

శతమానంభవతి

బ్యానర్ :

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

దర్శకత్వం :

సతీష్ వెగ్నేశ

నిర్మాతలు :

దిల్ రాజు

సంగీతం :

మిక్కి జే మేయర్

విడుదల తేది :

జనవరి 14, 2017

నటీనటులు :

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ, ఇంద్రజ తదితరులు గత ఏడాది సంక్రాంతి పోటిలో వచ్చి ఎక్స్‌ప్రెస్ రాజాతో సూపర్ హిట్ చేజిక్కించుకున్నాడు శర్వానంద్.

గతేడాది యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌నర్ తో సక్సెస్ అందుకున్న శర్వ, ఈసారి శతమానంభవతి అనే కుటుంబకథా చిత్రంతో సీనియర్ హీరోలతో పోటిపడుతున్నాడు.

దిల్ రాజు నిర్మించగా, రచయిత సతీష్ వెగ్నెశ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడండి.

కథలోకి వెళ్తే :

కోస్తాంధ్రలో ఆత్రేయపూరం ఓ పల్లెటూరు, వృద్ధ్యాపంలో అనోన్యంగా బ్రతుకుతున్న దంపతులు రాఘవరాజు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ).వారితోపాటే ఉండే మనవడు రాజు (శర్వానంద్).

వీరి కొడుకులు, కూతురు అంతా ఫారెన్ లోనే ఉంటారు.వీరి జీవితానికి ఇప్పుడు కొన్ని జ్ఞాపకాలు కావాలి.

అందుకే వేల మైళ్ళ దూరంలో ఉన్న సొంత మనుషులని ఊరికి రప్పిస్తారు.తెలుగింట్లో తెలుగు సంబరాలతో ఉత్సవంలా అనిపిస్తున్న వారి కలయిక, అలానే ఉండిపోతుందా లేదా తెర మీదే చూడండి.

Advertisement

నటీనటుల నటన :

అందుబాటులో ఉన్న నటుల్లో ఆ వృద్ధ దంపతుల పాత్రలు ఇంతకన్నా బాగా వేసే నటులు మరెవరు ఉండరేమో.ప్రకాష్ రాజ్, జయసుధ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపరుచలేరు అనే విషయం ఇక్కడ అందరికి తెలుసు అనుకోండి.ఒక సినిమాకి, మరో సినిమాకి సంబంధం లేకుండా కథలని ఎంచుకుంటున్న శర్వానంద్, తన నటనలో కూడా పాత్రతో మార్పులు చేసుకుంటున్నాడు.

తన పాత్ర, ఈ సినిమా, తన కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే విషయాలు.అనుపమ అందంగా కనిపించింది, అభినయంతో ఆకట్టుకుంది.

తానే డబ్బింగ్ చెప్పుకోవడం పెద్ద ప్లస్ అయ్యింది.నటి ఇంద్రజ కంబ్యాక్ బాగుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
1000 కోట్లతో చరిత్ర సృష్టించిన పుష్పరాజ్.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే!

నరేష్ నవ్విస్తాడు.మిగితా పాత్రధారులు తమ పరిధిమేరలో బాగా చేసారు.

Advertisement

టెక్నికల్ టీమ్ :

ఇలాంటి సినిమాలకి టైలర్ మేడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్.పాటలు ఇప్పటికే ఆహ్లాదకరంగా ఉండి మెప్పించాయి.

నేపథ్య సంగీతంలో ఎక్కువగా పాటల ట్యూన్స్ వాడుకున్నా, పల్లెటూరి అందాల్లో అవే వినసొంపుగా, మూడ్ ని ఎలివేట్ చేస్తూ ఉంటాయి.సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫి పల్లెటూరి లాగా అందంగా ఉంది.

పల్లెటూరి అందాలను పెంచింది కూడా.ఎడిటింగ్ కి మంచి మార్కులు పడతాయి.

ఇలాంటి బరువైన కథను రెండు పావు గంటల్లో చెప్పడం పెద్ద విషయం.

విశ్లేషణ :

సంక్రాంతి అంటే పండగ వాతావరణం.గత ఏడాది సంక్రాంతి పండక్కి సరిపోయే కథతో సొగ్గాడే చిన్నినాయన వస్తే, ఈసారి వంతు శతమానంభవతి సినిమాది.

అందమైన ఊరు, సెలవుల్లో మనం కోరుకునే వాతవారణం, మట్టి, మనుషులు, మనసులు .నిండైన తెలుగు సినిమా శతమానంభవతి.కెరీర్ కోసం ఎన్ని ఎత్తులు ఎక్కి, ఎంతదూరం వెళ్ళినా, పండక్కి అయినా తల్లిదండ్రులని ఎందుకు పలకరించాలో చెప్పే సినిమా.

అదనపు హంగులు ఉండవు, కమర్షియల్ గా ఇరికించిన సీన్లు ఉండవు, వినోదంపాళ్ళు తక్కువైనా, ఓ కథను, పాత్రలను, వారి స్వభావలని చూడలనుకునేవారు ఖచ్చితంగా ఈ చిత్రాన్ని ఇష్టపడతారు.సెకండాఫ్ కాస్త మెలోడ్రామాటిక్ గా అనిపించవచ్చు కాని, మన సెన్సిబిలిటిస్ అవేగా.

కుటుంబంతో మంచి ఆహ్లాదకరమైన కుటుంబకథాచిత్రం చూడాలనుకునేవారు మిస్ కావొద్దు.

ప్లస్ పాయింట్స్ :

* కథలోని భావోద్వేగాలు * మంచి సంగీతం * మహేష్, పవన్, ఎన్టీఆర్ డబ్ స్మాష్ సీన్ * క్లయిమాక్స్

మైనస్ పాయింట్స్ :

* కొన్నిచోట్ల మెలోడ్రామా * మాస్, యూత్ ప్రేక్షకులు కొరుకునే ఆంశాలు ఉండవు (బిజినెస్ పరంగా)

చివరగా :

అందమైన సినిమా

తెలుగుస్టాప్ రేటింగ్ :

3.25/5.

తాజా వార్తలు