పక్కా ప్లాన్ జగన్ పైకి "షర్మిల బాణం" !

గత కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల( Y.S.Sharmila ) గురించిన ప్రస్తావన హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్న సంగతి విధితమే.

ఈమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగబోతున్నారని ఇలా రకరాలక వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

అటు షర్మిల కూడా తన పార్టీ విలీనంపై వస్తున్న వార్తలను ఖండించకపోవడంతో ఈ వార్తలు నిజమేనేమో అనే సందేహలు వ్యక్తమౌతువస్తున్నాయి.మొత్తానికి తాజా పరిస్థితులు చూస్తుంటే షర్మిల పార్టీ ప్రస్తావన తుది అంకానికి చేరినట్లే తెలుస్తోంది.

sharmilas Arrow Up The Clear Plan Pictures, Ys Sharmila, D. K. Shivakumar , Y

ఇటీవల కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్( D.K.Shivakumar ) తో సమావేశం అయిన ఆమె.అధిష్టానంతో కూడా భేటీకి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ నెల చివరి నాటికి షర్మిల పార్టీ విలీనం కు సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల కొనసాగాలని చూస్తున్నప్పటికి కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆమెకు ఏపీ బాధ్యతలను అప్పగించే ఆలోచనలోనే ఉందట హస్తం హైకమాండ్.అయితే ఏపీలో తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy )కి వ్యతిరేకంగా కొనసాగడం ఇష్టం లేక ఇన్నాళ్ళు ఏపీ రాజకీయాలపై సైలెంట్ గా ఉన్న షర్మిల.

Advertisement

ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా అడుగులు వేయక తప్పదనే టాక్ నడుస్తోంది.

sharmilas Arrow Up The Clear Plan Pictures, Ys Sharmila, D. K. Shivakumar , Y

తాజా పరిణామాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ వైసీపీ వర్గాల్లో కలవరం పుట్టిస్తున్నాయి.షర్మిల ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందని, అందుకు సంబంధించిన అన్నీ పనులు పూర్తి అయినట్లు కనిపిస్తున్నాయని రఘురామ చెప్పుకొచ్చారు.నిజంగా షర్మిల ఏపీ కాంగ్రెస్ లో అడుగు పెడితే రాజన్న బాణంగా తనను తాను చెప్పుకునే షర్మిల.

ఆ బాణం కాస్త అన్న జగన్ కే గుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు రాజకీయవాదులు.కాగా షర్మిలను ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పటించడం నిజమే అయితే అది కాంగ్రెస్ పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏపీ కాంగ్రెస్ పూర్తిగా బలహీన పడిన నేపథ్యంలో షర్మిల ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే పూర్వ వైభవం లభించడం గ్యారెంటీ అనే చెప్పవచ్చు.మరి ఏం జరుగుతుందో చూడా.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు