ఆమెకు అంత సీన్ లేదా!!

అసలేం జరుగుతుంది టీ.వైకాపాలో.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే యూ టర్న్ తీసుకుని సమైఖ్యాంధ్రకే తన ఓటు వేసేసాడు వైఎస్ జగన్.

ఇక ఆ దెబ్బతో దాదాపుగా తెలంగాణాలో వైకాపా పోటీలో ఉండదేమో అనుకున్నారు అందరూ.

కానీ అనూహ్య రీతిలో జగన్ తెలంగాణాలో సైతం పోటీ చేసి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు ఒక్క ఖమ్మం జిల్లాకే పరిమితం అయ్యాడు.అక్కడే దాదాపుగా 3 ఎం.ఎల్.ఏ, ఒక ఎంపీ స్థానం ఆ పార్టీకి ఎండమావిలో నీటి చుక్కలా దక్కింది.ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణా పూర్తి భాద్యత శర్మిల కు అప్పజెప్పాడు జగన్.

ఆమె ఇష్టం లేకపోయినా ఆయన బలవంతంతో పరామర్శ యాత్రకు బయలుదేరింది శర్మిల.వైకాపా నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పరామర్శ యాత్రకు బయలు దేరిన శర్మిల టూర్ వివరాలు వివరించారు.

Advertisement

అంతేకాకుండా ఇదే కోవలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు సైతం చేశారు.షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పార్టీలో ఏమాత్రం మార్పులేదని.పార్టీ నుంచి వలసలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ షర్మిల యాత్ర కేవలం పరామర్శలకు సంబంధించినదేనని, వలసలకు షర్మిల యాత్రకూ సంబంధమేలేదన్నారు.

మరోపక్క ఆవిడ కూడా తెలంగాణ బాధ్యతల పట్ల అంత సీరియస్ గా లేనట్టు కనిపిస్తోంది.పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నా.

వారిని పిలిచిమాట్లాడే పరిస్థితి లేదు.పార్టీ కార్యకర్తల్లో స్థైర్యం నింపే ప్రయత్నాలు ఏమాత్రం జరగడం లేదు.

మరి దీనిపై జగన్ ఏమైనా ఆలోచనలు చేసి మళ్లీ పార్టీకి తెలంగాణాలో పునర్జీవం పోస్తాడేమో చూడాలి.

చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు