రూపాయి ఖర్చు లేకుండా CCTV ఇలా సెటప్ చేసుకోండి!

ఇపుడు చిన్న పెద్ద తరహా వ్యాపారస్తులకు, ఆఫీసులకు CCTV అనేది అవసరం అవుతుంది.లొకేషన్ ఏదైనప్పటికీ, జాగ్రత్తలు తీసుకోవడం ఇపుడు పరిపాటిగా మారింది.

అయితే వీటికోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయాలని కొంతమంది వీటిని ఏర్పాటు చేయకుండా కోరి కష్టాలు కొని తెచ్చుకుంటూ వుంటారు.తరువాత లబోదిబోమని అప్పులు చేసి మరీ మార్కెట్లో ఎక్కువ రేట్లు పోసి కొంటూ వుంటారు.

రూపాయి ఖర్చు లేకుండా CCTV ఇలా సె�

అయితే పైసా ఖర్చు లేకుండానే CCTVని ఏర్పాటు చేసుకోవచ్చని కొంతమంది నిపుణులు అంటున్నారు.ఆ విషయాలు ఇపుడు ఒక్కసారి చూద్దాం.

దీనికి ఒక పాత ఫోన్, మరియు ఒక యాప్ ఉంటే సరిపోతుంది.ఇపుడు అది ఎలాగ చెయ్యాలో చూద్దాం.1.ముందుగా మీ పాత ఫోనులో సెక్యూరిటీ కెమెరా యాప్ ని ఎంచుకోవాలి.ఇలాంటివి చాలా యాప్స్ Google storeలో కలవు.ఫుటేజీని రిమోట్‌గా లేదా స్థానికంగా స్టోరేజి చేసే సదుపాయం కూడా ఇందులో కలదు.2.సెటప్ చేసిన తర్వాత, మీ ఇంటిలో లేదా ఎక్కడి నుండైనా ఈ సెక్యూరిటీ కెమెరాను నియంత్రించవచ్చు.మీరు దీన్ని మీరు వాడుతున్న ఫోన్ ద్వారా చేయవచ్చు.మీ ఫోన్‌ను సెక్యూరిటీ కెమెరా చేసుకోవడానికి Alfred యాప్ వాడటం మంచిది.3.ఈ ALfred మీకు ప్రత్యక్ష ఫీడ్ యొక్క రిమోట్ వ్యూను అందిస్తుంది, అంతేకాకుండా మీరు దీనినుండి హెచ్చరికలను కూడా పొందుతారు.మీకు ఇందులో ఉచిత క్లౌడ్ స్టోరేజి లభిస్తుంది.దీనితో పాటు, మీకు టూ-వే ఆడియో ఫీడ్ కూడా లభిస్తుంది.4.మీ 2 ఫోన్‌లలోనూ ఈ యాప్ ని డౌన్‌లోడ్ చేయవలసి ఉంటుంది.దీని తరువాత, మీరు స్టార్ట్ బటన్‌ను చూస్తారు, దానిపై క్లిక్ చేయడంద్వారా మీరు ముందుకు వెళతారు.

Advertisement

తరువాత Google ఖాతాతో సైన్ ఇన్ చేయాలి.తరువాత పాత ఫోన్‌లో మీరు వ్యూవర్ కి బదులుగా కెమెరాను ఎంచుకోవాలి.5.దీని తరువాత మీరు 2 ఫోన్‌లలో ఒకే ఖాతాకు సైన్ ఇన్ అయ్యారని అర్ధం చేసుకోవాలి.ఇప్పుడు మీ సెటప్ పూర్తవుతుంది.

ఇప్పుడు మీరు మీ ఫోన్‌ను మీ ఇంట్లో సరైన స్థలంలో ఉంచి, ఆ తర్వాత మీరు మీ ఇతర ఫోన్‌ ఒక సెక్యూరిటీ కెమేరాగా మీకు లైవ్ ఫీడ్ అందిస్తుంది.

Advertisement

తాజా వార్తలు