సెప్టెంబర్ 17 విద్రోహదినం:సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ

తెలంగాణకు సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమేనని( Vidroha Dinam ) సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెప్టెంబర్ 17ను విద్రోహదిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పంచి,3 వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసుకొని,నిజాం ప్రభుత్వంలోని రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ జమిందార్, భూస్వామ్య ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటామే చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉందన్నారు.

నెహ్రూ సైన్యాలు సెప్టెంబర్ 13న తెలంగాణకు వచ్చి 17న నిజాం రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారని,కానీ,1951 వరకు నెహ్రూ సైన్యాలు తెలంగాణలోని ఉండే కమ్యూనిస్టులను ఊచకోత కోశారని గుర్తు చేశారు.భూస్వాములకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) నిలబడిందని,ప్రజలు స్వాధీనం చేసుకున్న భూములు తిరిగి భూస్వాములకు అప్పగించారని, కమ్యూనిస్టుల వెంట ప్రజలు ఉన్నారనే అక్కసుతో దాడులు చేశారని అన్నారు.

తెలంగాణ కమ్యూనిస్టుల( Telangana Commuunists ) ఆధీనంలోకి వెళుతుందనే కుట్రతోనే కమ్యూనిస్టులను ఊచకోత కోశారని,కాబట్టి సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహదినమే అన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టియు జిల్లా కార్యదర్శి గంటా నాగయ్య,జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు,పి.

డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పోలేబోయిన కిరణ్, పెద్ధింటి అశోక్ రెడ్డి, దుర్గయ్య,బొడ్డు ముత్తయ్య,దండి ప్రవీణ్, మందడి శ్రీధర్,సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
మహిళ సమాఖ్యలో భారీ కుంభకోణం.. 28 లక్షలు స్వాహా

Latest Suryapet News