వచ్చే ఎన్నికల విషయంలో పోటీపై అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం తెలిసిందే.

ఈ క్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఎల్లప్పుడూ ప్రజలలో ఉండే రీతిలో అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రజల మెప్పుని.ఓట్లని పొందాలి అనే తలంపుతో "గడపగడపకు మన ప్రభుత్వం" ప్రతి నియోజకవర్గంలో జరిగేలా స్థానిక ఎమ్మెల్యే పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు.

Sensational Comments Of Avanti Srinivas On Competition In Upcoming Election,s Av

ఇదే సమయంలో ప్రజలలో పట్టు ఉండని ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని కూడా హెచ్చరికలు చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికలలో భీమిలి నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.అంతేకాదు రాజకీయాల్లో ఉంటే వైసీపీ లోనే ఉంటా అని అన్నారు.

Advertisement

ఇటీవల గత కొద్ది వారాల నుండి అవంతి శ్రీనివాస్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలో తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు వైసీపీ లోనే అని క్లారిటీ ఇవ్వటంతో.

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలకి చెక్ పెట్టినట్లు అయింది.

Advertisement

తాజా వార్తలు