చిరంజీవి, ఎన్టీఆర్ మధ్య అలాంటి విబేధాలు ఉన్నాయా.. అసలు నిజం ఏంటి?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి, అదేవిధంగా స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ల గురించి మనందరికీ తెలిసిందే.

ఇద్దరికీ ఎవరికి తగ్గట్టుగా ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చిరుకి, ఎన్టీఆర్ కి మధ్య ఒక గ్యాప్ ఉండేది.ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఎవరో తెలియదు అంటూ చెప్పడం అప్పట్లో ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

అంతేకాకుండా అప్పట్లో వీరిద్దరి మధ్య గ్యాప్ ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

Senior Producer Ravula Giri About Ntr And Chiranjeevi Clashes, Junior Ntr, Chira

అనంతరం చిరంజీవి మనస్తత్వం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ ఫ్యామిలీతో కలిసి పోయారు.మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో జూనియర్ ఎన్టీఆర్ కు ఒక చక్కటి స్నేహబంధం ఏర్పడింది.స్నేహబంధం ఎంతలా ఏర్పడింది అంటే వీరిద్దరూ కలసి మరొక సినిమాను చేయాలి అనే అంతలా ఆ ఇద్దరు హీరోల మధ్య స్నేహ బంధం బలపడింది.

Advertisement
Senior Producer Ravula Giri About NTR And Chiranjeevi Clashes, Junior NTR, Chira

కాని ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిరంజీవికి, ఎన్టీఆర్ కు ఎందుకు పడలేదు అన్న విషయంపై ఎవరూ నోరు మెదపలేదు.అయితే అందుకు గల కారణాలు బాక్సాఫీస్ వద్ద వచ్చిన వసూళ్లు, ఇగో గొడవలు అన్న వార్తలు వినిపించాయి.

Senior Producer Ravula Giri About Ntr And Chiranjeevi Clashes, Junior Ntr, Chira

అది కూడా ఒక రకంగా నిజమే.ఇదిలా ఉంటే ఈ విషయంపై సీనియర్ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అయిన ఆవుల గిరి ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.ఎన్టీఆర్ తో కెరీర్ మొదట్లో ఒక మేనేజర్ ఉండేవాడట.

ఆ మేనేజర్ చిరంజీవి గురించి ఎన్టీఆర్ కు లేనిపోని మాటలు కల్పించి చెప్పేవాడట.అలా అతని మాటలు నమ్మిన ఎన్టీఆర్ కి చిరంజీవిపై తెలియని కోపం ఏర్పడింది.

ఆ కొద్ది రోజుల తర్వాత ఎన్టీఆర్ వద్ద ఉన్న మేనేజర్ గురించి ఎన్టీఆర్ కు అసలు నిజాలు తెలియడంతో మేనేజర్ గా తొలగించారని, ఆ తరువాత మెగాస్టార్ ఫ్యామిలీ తో జూనియర్ ఎన్టీఆర్ కలిసిపోయారని చెప్పుకొచ్చారు గిరి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు