ఢిల్లీ అల్లర్లలో సీతారాం ఏచూరి పేరు?

ఒకప్పుడు గ్రౌండ్ లెవల్ లో దేశంలోనే అతి బలమైన శక్తిగా నిలిబడిన కమ్యూనిస్టులు ఈరోజు దేశంలో ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని ప్రాంతాలలో తమ ఉనికిని కోల్పోయారు.

దేశ ప్రయోజనాల గురించి పట్టించుకోకుండా అంతర్జాతీయ కోణంలో అన్ని అంశాలను చూస్తూ దేశాన్ని అవమానించడం వల్లనే వారికి ఈ గతి పట్టింది అని రైట్ వర్గం వారు అభిప్రాయపడుతున్నారు.

దీనిపై స్పందించిన విశ్లేషకులు సైతం రైట్ వర్గం వారు చెప్పింది అక్షర సత్యమని ఇప్పటికైనా కమ్యూనిస్టులు తమ ధోరణి మార్చుకోకుంటే ఇక ఎప్పటికీ తోకపార్టీలుగా మిగిలిపోవాల్సి వస్తుందని అంటున్నారు.సరిగ్గా ఇలాంటి చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించిన వారిపై అలాగే వారిని ప్రేరేపించిన వారిపై తాజాగా చార్జిషీట్ నమోదు చేశారు.

ఇందులో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరు ప్రస్తావించారు.ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తావిస్తోంది ఇంతకీ పోలీసులు చార్జిషీట్ లో సీతారాం ఏచూరి తో పాటు ప్రస్తావించిన మిగతా వారు ఎవరు? ఇంతకీ అసలు వీరి పేర్లను ఎందుకు చార్జిషీట్ లో చేర్చారో ఇప్పుడు చూద్దాం.ప్రస్తుతం పోలీసులు నమోదు చేసిన చార్జిషీట్ లో సీతారాం ఏచూరి, స్వరాజ్‌ అభియాన్‌ నాయకుడు యోగేంద్ర యాదవ్‌, ఆర్థికవేత్త జయతి ఘోష్‌, ఢిల్లీ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్‌, కార్యకర్త అపూర్వానంద్‌, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత రాహుల్‌ రాయ్‌ల పేర్లు ఉన్నాయి.

వీరు సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను తీవ్రం చేయాలని నిరసనకారులను కోరినట్లు అందుకే వీరిని సహకుట్రదారులుగా చార్జిషీట్‌లో చేర్చామని పోలీస్ అధికారులు అంటున్నారు.

Advertisement
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

తాజా వార్తలు