వాషింగ్టన్ : ఉక్రెయిన్ ఎంబసీ వద్ద ఆయుధాలతో ఆగంతకులు.. సీక్రెట్ సర్వీస్ అదుపులో ఇద్దరు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తోంది.రష్యా అధినేతను నిలువరించేందుకు అన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇప్పటికే స్విఫ్ట్ నుంచి రష్యాను వెలివేయగా.అమెరికా సహా యూరప్ దేశాలు ఆంక్షల కత్తి దూశాయి.

అయినప్పటికీ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు.ఈ నేపథ్యంలో అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని ఉక్రెయిన్ ఎంబసీ వద్ద సాయుధులైన ఆగంతకులు హల్ చల్ చేయడం కలకలం రేపింది.

దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు రంగంలోకి దిగి.ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

గురువారం ఎంబసీ కార్యాలయానికి సమీపంలోని విస్కాన్సిన్ అవెన్యూ, ఎం స్ట్రీట్ ఎన్‌డబ్ల్యూ ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేశారు.ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడటానికి వీరు ఇండియా నుంచి వెళ్లినట్లుగా వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది.

నిషేధిత ఆయుధాలను కలిగి వుండటం, నమోదుకానీ మందుగుండు సామాగ్రిని రవాణా చేయడం వంటి అభియోగాలను వీరిపై నమోదు చేశారు.సాధారణంగా సీక్రెట్ సర్వీస్ అరెస్ట్ చేసిన అనుమానితుల గుర్తింపులను విడుదల చేయదు.

కేసు దర్యాప్తు నిమిత్తం వీరిద్దరిని మెట్రోపాలిటిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ రెండవ జిల్లా స్టేషన్‌కు తరలించారు.కాగా.

రష్యాతో జరుగుతున్న పోరాటంలో తమకు అండగా నిలిచేందుకు ఉక్రెయిన్‌కు తరలి రావాల్సిందిగా విదేశీ మద్ధతు దారులను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

మరోవైపు .రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా పాలు పంచు కోదని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.అయితే, మిత్ర దేశాలతో కలిసి నాటో భూభాగాలను కాపాడు కుంటామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

యుద్ధంలో పుతిన్ ప్రస్తుతానికి విజయం సాధించవచ్చేమో కానీ దీర్ఘకాలంలో అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని బైడెన్ హెచ్చరించారు.కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో తన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు ఈ విషయాన్ని పేర్కొన్నారు.

" autoplay>

తాజా వార్తలు