Savitribai: ఈవ్ వోన్నే మడే డి మరోస్ అనే మహిళా సావిత్రిబాయి గా ఎలా మారింది ? దేశం గర్వించే విషయం

ఈవ్ వోన్నే మడే డి మరోస్.( Eve Yvonne Maday de Maros ) స్విట్జర్లాండ్లో జన్మించిన ఈమె తన మనసులో మాత్రం భారతీయతను నింపుకుంది.

స్విట్జర్లాండ్లోని( Switzerland ) న్యూచాటెల్ లో 1913 లో జన్మించిన ఈవ్ వోన్నే మడే డి మరోస్, తన 19 వ ఏట భారతదేశాన్ని సందర్శించింది.భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలు, ఇక్కడి భిన్న మతాలు, కులాలు, వ్యవస్థలు ఆమెను ఎంతగానో ఆకర్షించాయి.

భారతదేశ మూలలను తెలుసుకోవాలనుకుంది.పట్టు విడువకుండా మన దేశ కళలు, నృత్యాలు, పురాణాలూ, గ్రంధాలూ, ఆధ్యాత్మికత పై అపార జ్ఞానాన్ని సంపాదించింది.

Savitribai Khanolkar Who Designed Param Vir Chakra Award To Indian Soldiers

ఆమె భారతదేశంలో పర్యటిస్తున్న సమయంలో ఒక యువ సైనికాధికారితో ప్రేమలో పడింది.అతనే మహారాష్ట్రకు చెందిన విక్రమ్ ఖణోల్కర్.( Vikram Khanolkar ) వీళ్లిద్దరు వివాహం కూడా చేసుకున్నారు.

Advertisement
Savitribai Khanolkar Who Designed Param Vir Chakra Award To Indian Soldiers-Sav

తరువాత కొన్నాళ్ళకు ఈవ్ వోన్నే మడే డి మరోస్ తన పేరును సావిత్రిబాయి ఖణోల్కర్ గా( Savitribai Khanolkar ) మార్చేసుకుంది.బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది తన అస్తిత్వం తిరిగి పునరుద్ధరించుకోవడానికి భారతదేశం సిద్దమవుతున్న సమయంలో మన సైన్యంలో మేజర్ జనరల్ హీరాలాల్ అటల్, ఒక విదేశీ మహిళా ఐనప్పటికీ సావిత్రిబాయి ఖణోల్కర్ కు మన దేశంపై ఉన్న జ్ఞానం చూసి ముచ్చటేసింది.

దాంతో భారత్ పునరుద్ధరణ బృందంలో భాగమైంది ఈవ్ వోన్నే మడే డి మరోస్.

Savitribai Khanolkar Who Designed Param Vir Chakra Award To Indian Soldiers

ఈ క్రమంలోనే సైనికులకు తమ త్యాగానికి, సైర్యానికి ఇచ్చే పురస్కారానికి బీజం పడింది.దేశ సంరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, సరిహద్దులలో కాపలా కాసే సైనికులకు( Soldiers ) ఇచ్చే పురస్కారం అంటే మాటల? అది వారు మన దేశానికీ చేస్తున్న సేవకు, త్యాగానికి, కృషికి ఒక గుర్తింపు.వారిని మనం గౌరవించుకునేందుకు ఒక చిహ్నం.

పరమ వీర చక్ర పురస్కారాన్ని( Param Vir Chakra ) డిజైన్ చేయడంలో ఈవ్ వోన్నే మడే డి మరోస్ ది ప్రధాన పాత్రయింది.ఆమె ఈ పురస్కారాన్ని డిజైన్ చేయడానికి, వ్యూహానికి, దేర్యానికి మారుపేరైన ఛత్రపతి శివాజీని( Chatrapati Shivaji ) స్ఫూర్తిగా తీసుకుంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెరుకు రసం మెషిన్‌లో ఇరుక్కుపోయిన మహిళ జుట్టు.. ఏం జరిగిందంటే?

అందుకే ఆ పురస్కారంపై మన పురాణాలూ చెప్పినట్టు సాక్షాత్తు భవాని మాత శివాజీకి ఇచ్చిన వజ్రాయుధంగా పిలిచే కత్తిని ముద్రించారట.

Advertisement

ఈ పురస్కారం వృత్తాకారంలో ఉంటుంది.దీన్ని కాంస్యం తో చేస్తారు.దీనికి ఒక వైపు భారతదేశ చిహ్నం, దాని చుట్టూ వజ్ర నమూనాలు కనిపిస్తాయి.

వెనుక వైపు పరమ వీర చక్ర అని హిందీ లోను, మరియు ఆంగ్లం లోను ముద్రించి ఉంటుంది.దధీచి అనే మహర్షి ఎముకులతో వజ్రాయుధాన్ని తయారు చేసారని మన పురాణాలూ చెబుతున్నాయి.

ఈ పురస్కారాన్ని మొదటిసారి 1947 లో పాకిస్తాన్ తో యుద్ధం అనంతరం, మేజర్ సోమనాథ్ శర్మ( Major Somnath Sharma ) అందుకున్నారు.ఇప్పటివరకు 21 మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

తాజా వార్తలు