స‌మ్మ‌ర్‌లో డీహైడ్రేష‌న్‌కు అడ్డుక‌ట్ట వేసే సత్తు ష‌ర్బ‌త్‌.. అస్స‌లు మిస్ అవ్వ‌కండి!

డీహైడ్రేష‌న్‌.స‌మ్మ‌ర్‌లో ప్రాధానంగా వేధించే స‌మ‌స్య‌ల్లో ఇదే ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

శరీరంలో తగినంత నీటి శాతం లేన‌ప్పుడు వ‌చ్చే స‌మ‌స్య‌నే డీహైడ్రేష‌న్ అంటారు.

దీని వ‌ల్ల తలనొప్పి, అధిక దాహం, ఆకలి మందగించడం, అల‌స‌ట‌, మూత్రం తక్కువగా రావడం, మానసిక గందరగోళం, మూర్ఛ, తీవ్ర‌మైన అసౌక‌ర్యం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతుంటాయి.

అందుకే డీహైడ్రేష‌న్ వ‌చ్చాక బాధ‌ప‌డ‌టం కంటే రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఎంతో ఉత్త‌మం అని అంటున్నారు నిపుణులు.అయితే డీహైడ్రేష‌న్‌కు అడ్డుక‌ట్ట వేయ‌డంలో సత్తు ష‌ర్బ‌త్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

వేయించిన శనగల పిండినే సత్తుగా పిలుస్తారు.స‌త్తు ష‌ర్బ‌త్ ను త‌యారు చేసుకోవ‌డం కూడా ఎంతో సులువు.

Advertisement

అందుకోసం ముందుగా ఒక క‌ప్పు వేయించిన శ‌న‌గ‌ల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌టి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత గ్లాస్ తీసుకుని అందులో ఒక‌టిన్న‌ర స్పూన్ వేయించిన శ‌న‌గ‌ల పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ ప‌ట్టిక బెల్లం పొడి, చిటికెడు న‌ల్ల ఉప్పు, పావు టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ మ‌రియు కొద్దిగా వాట‌ర్ పోసి అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.చివ‌ర‌గా ఇందులో ఒక క‌ప్పు చిల్డ్ వాట‌ర్‌, రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే స‌త్తు ష‌ర్బ‌త్ సిద్ధ‌మైన‌ట్లే.

ప్ర‌స్తుత వేస‌వి కాలంలో రోజుకు ఒక గ్లాస్ ఈ స‌త్తు ష‌ర్బ‌త్‌ను తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ అవ్వ‌కుండా ఉంటుంది.అధిక వేడిమి నుంచి ఈ ష‌ర్బ‌త్ చల్లదనాన్ని అందిస్తుంది.అంతే కాదండోయ్‌.

ఈ స‌త్తు ష‌ర్బ‌త్‌ను డైట్‌లో చేర్చుకుంటే నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఎముక‌లు దృఢంగా మార‌తాయి.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

మ‌రియు వెయిట్ లాస్ కూడా అవుతారు.

Advertisement

తాజా వార్తలు