తెలంగాణ: హరిత నిధి పేరుతో విద్యార్థుల నుండి నిధి వసూలు చేసే విధానాన్ని ఖండిస్తున్నాం- ఎస్ ఎఫ్ ఐ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హరిత నిధి పేరుతో రాష్ట్రంలోని విద్యార్థులు మరియు వేర్వేరు వర్గాల ఉద్యోగులు , వ్యాపారుల నుండి బలవంతంగా నిధి వసూళ్ళు చేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది .రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హరిత నిధి సమీకరణ విధానాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష , కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి , టి నాగరాజు ఒక ప్రకటనలో ఖండించారు .

 Sfi Condemns Collecting Haritha Nidhi Funds From Students, Sfi, Haritha Nidhi,t-TeluguStop.com

వారు మాట్లాడుతూ తెలంగాణ హరిత నిధి పేరుతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో , కళాశాలల్లో అడ్మిషన్ అయ్యే క్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నుండి 5 రూపాయలు , హైస్కూల్ విద్యార్థుల నుండి 15 రూపాయలు , ఇంటర్మీడియట్ విద్యార్థుల నుండి 25 రూపాయలు , డిగ్రీ విద్యార్థుల నుండి 50 రూపాయలు , పీజీ మరియు ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు నుండి 100 రూపాయలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నారు .అదే విధంగా వేర్వేరు వర్గాల ఉద్యోగులు , వ్యాపారుల నుండి ట్రేడ్ లైసెన్స్ వాణిజ్య వ్యాపారుల నుండి 1000 రూపాయలు , ఐఏఎస్ , ఐపిఎస్ వేతనాలు నుండి 100 , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీల వేతనాల నుండి 500 రూపాయలు , టిజీవో , టిఎన్జీవో ఉ ద్యోగుల వేతనాల నుండి 25 రూపాయిలు వసూళ్లు చేయనున్నారు .ప్రతీ రెవెన్యూ భూమి అమ్మకం , కొనుగోలుపై 50 రూపాయలు వసూళ్లు చేయనున్నారు .తెలంగాణ హరిత నిధి పేరుతో బలవంతంగా విద్యార్థులు , ఉద్యోగులు , వ్యాపారుల నుండి వసూళ్లు చేయడం సరియైనది కాదన్నారు .ఏ ప్రభుత్వ ఖాతా ద్వారా ఈ డబ్బంతా నిర్వహిస్తున్నారో , ఇప్పటికీ ఎంత వసూళ్లు చేసారో శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు .కేంద్రం పిఎం కేర్ ఫండ్ తరహాలోనే ఇది కూడా ఒక బోగస్ ఖాతా ద్వారా వసూళ్ళు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు .దీనిని సబ్బండ వర్గ ప్రజలు , ప్రజాస్వామిక వాదులు , మేధావులు ఖండించాలని కోరారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube