మన ఈ భూ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలను నిత్యం మనమందరం చూస్తూనే ఉన్నాము.కొన్ని వింతలు చూస్తే భలే ఆశ్చర్యకరంగా ఉంటాయి.
మరి కొన్నిటిని చూస్తే అసలు నమ్మ బుద్ది కాదు.అలాంటి ఒక వింత గురించి మీరు ఈరోజు తెలుసుకోవాలి.
ఈ వింత గురించి మీరు ఎప్పుడు వినడం గాని, చూడడం గాని చూసి వుండరు.మాములు వాళ్ళ సంగతి ఎలా ఉన్నాగాని మందు బాబులు మాత్రం ఈ వింత గురించి తెలుసుకుంటే ఎక్కింది కాస్త దిగిపోతుంది అనే చెప్పాలి.
మరి ఆ వింత ఏంటని అనుకుంటున్నారా.అదేంటంటే స్కాచ్ విస్కీ బాటిల్.
మందులో చాలా రకాలు ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.కానీ ఈ స్కాచ్ విస్కీ బాటిల్ మాత్రం సుమారు 32 ఏళ్ల క్రితం తయారు చేసినది.
దాని పేరు ‘ది ఇంట్రెపిడ్‘.అయితే ఇప్పుడు ఈ బాటిల్ ను వేలం వేయనునట్టు స్కాట్లాండ్ కు చెందిన మాకల్లన్ కంపెనీ తెలిపింది.
ఈ బాటిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది సాదా సీదా విస్కీ బాటిల్ కాదండోయ్.ఏకంగా మనిషి ఎత్తున్న బాటిల్.
ఈ బాటిల్ లో దాదాపు 311 లీటర్ల విస్కీ ఉంటుందట.
ప్రపంచంలోనే అతి పెద్ద బాటిల్ గా గత సంవత్సరమే రికార్డును సృష్టించింది.అంతేకాకుండా గిన్నీస్ బుక్ లో కూడా అతి పెద్ద విస్కీ బాటిల్ గా చోటు కూడా దక్కించుకుంది.తాజాగా ఇప్పుడు ఈ బాటిల్ ను స్కాట్లాండ్ రాజధాని ఎడిన్ బర్గ్ కు చెందిన ప్రముఖ కంపెనీ లైఆర్ అండ్ టర్నబుల్ దీన్ని 12 కోట్ల 47 లక్షల రూపాయలతో వేలం వేయనున్నట్టు తెలుస్తుంది.
ఇలా వచ్చిన డబ్బులలో 25 శాతాన్ని మేరీ క్యూరీ అనే చారిటీకి ఇవ్వాలని భావిస్తున్నారట.మరి ఈ విస్కీ బాటిల్ వేలం పాటలో ఎంత ధర పలుకుతుందో అనేది వేచి చూడాలి.