'ఆర్ఆర్ఆర్'పై సెటైర్.. స్పందించిన టీమ్!

రాజమౌళి సినిమా తీస్తు్న్నాడంటే అది వందశాతం హిట్ సాధించాల్సిందే.ఇప్పటివరకు అతను తీసిన సినిమాలు అన్ని ప్రేక్షకులను చాలా వరకు మెప్పించనవే.

దర్శకధీరుడు సినిమా కోసం అభిమానులు ఎంత కాలమైన ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.సమయం కాస్త ఎక్కువగానే తీసుకున్న ఓపికగా ఎదురుచూస్తు్ంటారు.

రెండుమూడేళ్లు ఒక సినిమాను జనంలోకి తీసుకువస్తున్న ఆయన పట్ల ఫ్యాన్స్‌కు ఎనలేని నమ్మకం ఉంటుంది.అలాగే ఆయన తీసిన ప్రతి సినిమా క్రేజిని ఏమాత్రం తగ్గించకుండా అభిమానలు అలానే ఆదరిస్తుంటారు.

అతని సినిమాకు సంబంధించిన చిన్న అప్‌డేట్‌ ఇచ్చిన దానిని చూడడం కోసం అభిమానులు ఎగబడుతుంటారు.ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి కూడా ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Satire On Rajamouli RRR Movie, RRR Movie, Rajamouli, Ramcharan, NTR, Ajay Devgan

ప్రతి పండుగకు రాజమౌళీ తీసే సినిమాకు సంబందించిన అప్‌డేట్‌ వస్తుంది.కానీ తాజా చిత్రానికి సంబందించిన అప్‌డేట్స్ లేట్ అవుతుడడంతో అభిమానులకు కాస్త అసహనానికి గురవుతున్నారు.

ఇక ఓపిక నశించిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దర్శకధీరుడి ఆర్ఆర్ఆర్ సినిమాపై సెటైర్లు వేస్తున్నారు.తాజాగా ఓ అభిమాని ఆర్‌ఆర్‌ఆర్‌ రాజమౌళి కుటీరం పేరుతో కార్టూన్లు వేసి సామాజిక మాధ్యమాంలో పోస్ట్ చేశాడు.

అందులో రామ్‌చరణ్‌, తారక్‌ నిలబడి ఉండగా వారి ముందు ఇద్దరు మహిళలు ముగ్గులు వేస్తూ ఉంటారు.వారు ముగ్గులు వేసుకుంటూ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చర్చింకుంటారు.

Satire On Rajamouli Rrr Movie, Rrr Movie, Rajamouli, Ramcharan, Ntr, Ajay Devgan

అక్కా ఇంతకీ సినిమా రిలీజ్‌ ఎప్పుడు.? అని చెల్లి ఆడగ్గా.తప్పమ్మా.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
బీఎల్ఏ దాడి.. 'జాఫర్ ఎక్స్‌ప్రెస్' రైలు హైజాక్

తెలియనివి అడక్కూడదు అంటూ ఆ అక్క సమాధానం ఇస్తుంది.ఈ ట్విట్ బాగా వైరల్ కావడంతో సినిమా బృందం స్పందించింది.

Advertisement

ఈ ట్విట్‌ను రీట్వీట్‌ చేస్తూ సృజనాత్మకత కలిగిన సెటైర్‌.బాగుంది.అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్‌ను జత చేసింది.

ఇక ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే డి.వి.వి.దానయ్య నిర్మాతగా.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్వవహారిస్తున్నారు.

అలియాభట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లు నటిస్తుండగా అజయ్‌దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తాజా వార్తలు