చిన్నమ్మ విడుదల విషయంలో మరో ట్విస్ట్

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన ఆమె గత కొంత కాలంగా బెంగుళూరు లోని పరప్పన అగ్రహార కారాగారం లో శిక్షను అనుభవిస్తున్నారు.

అయితే ఆమె త్వరలో విడుదల కానుండగా ఆమె విడుదల విషయంలో ఒక ట్విస్ట్ వచ్చి పడింది.ఆమె విడుదల అవ్వాలి అంటే రూ.10 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలి అంటూ కారాగార సూపరింటెండెంట్ ఆర్.లత తెలిపినట్లు తెలుస్తుంది.ఆమె జనవరి 2021 లోపు విడుదల కావాలి అంటే రూ.10 కోట్లు చెల్లించాలి అంటూ లేదంటే 2022 జనవరి వరకు వేచి ఉండాల్సిందే అని సంబంధిత అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.సమాచార హక్కుద్వారా న్యాయవాది టి.నరసింహమూర్తి దాఖలు చేసిన దరఖాస్తు కు సమాధానంగా పై విధంగా వెల్లడించినట్లు తెలుస్తుంది.అయితే మరోపక్క శశికళ తరపు న్యాయవాది మాత్రం ఆ వార్తలను కొట్టిపడేస్తున్నారు.

Sasikala May Be Released On January 27 If She Pays Rs 10 Crore Fine: Karnataka P

ఆమె జనవరి లోపే ఎలాంటి జరిమానా లేకుండా జైలు నుంచి విడుదల అవుతారు అంటూ చిన్నమ్మ న్యాయవాది ఎన్.రాజా సెంతూర్ స్పష్టం చేస్తున్నారు.

3 సెకన్లలో మూడు దేశాలలో అడుగు పెట్టిన అమ్మాయి.. ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు