రాధేశ్యామ్ నుండి 'సంచారి' సాంగ్ టీజర్.. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా రాధే శ్యామ్.ఈ సినిమాలో బుట్టబొమ్మ

పూజ హెగ్డే

హీరోయిన్ గా నటిస్తుంది.

గత రెండు సంవత్సరాలుగా సెట్స్ మీదనే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దాంతో ప్రమోషన్స్ ఇప్పటి నుండే చేస్తూ వరుస అప్డేట్ లు వదులుతున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి మూడవ సాంగ్ ను విడుదల చేసారు.సంచారి సాంగ్ టీజర్ ను మేకర్స్ విడుదల చేసారు.

ఓన్లీ మ్యూజిక్ తో ప్రభాస్ లుక్ ను రివీల్ చేసారు.ప్రభాస్ ఈ సినిమాలో ఫ్యాన్స్ అందరు ఆశ్చర్య పోయే విధంగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Advertisement
Sanchari Song Promo Released Radhe Shyam Movie, Pooja Hegde, Prabhas, Radhe Shya

పూర్తి పాటను ఈ నెల 16న విడుదల చేయబోతున్నారు.చలో చలో సంచారి అంటూ సాగే ఈ పాటను అనిరుద్ రవిచందర్ ఆలపించారు.

Sanchari Song Promo Released Radhe Shyam Movie, Pooja Hegde, Prabhas, Radhe Shya

ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు అందరిని అలరించాయి.ఇక ఈ పాట కూడా అలరిస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమా 1970 లో యూరప్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ.తాజాగా రిలీజైన ఈ టీజర్ చూసిన అభిమానులు డార్లింగ్ లుక్ కు ఫిదా అవుతున్నారు.

యువీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు.అంతేకాదు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు