Sai Pallavi : సావిత్రి విజయ నిర్మల బాటలో సాయి పల్లవి.. సక్సెస్ సాధించినా?

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సాయి పల్లవి ( Sai Pallavi )ఒకరు.

ఈమె అందరి హీరోయిన్ల మాదిరిగా కాకుండా ఎంతో విభిన్న రీతిలో ఆలోచిస్తూ సినిమా అవకాశాలను అందుకుంటు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా హీరోయిన్గా వరుస సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అయినటువంటి సాయి పల్లవి ఇటీవల కాలంలో సినిమాలకు చిన్న విరామం ప్రకటించారు.ఈ విరామ సమయంలో ఈమె వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేశారు.

అయితే ఇప్పుడు ఇప్పుడే తిరిగి వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

Sai Pallavi Is Going To Be Director

ప్రస్తుతం ఈమె నాగచైతన్య ( Nagachaitanya ) హీరోగా నటిస్తున్నటువంటి తండేల్( Thandel ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అమీర్‌ఖాన్‌ కొడుకు హీరోగా రూపొందుతోన్న సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీ అయినటువంటి సాయి పల్లవి త్వరలోనే మెగా ఫోన్ పట్టబోతున్నారని తెలుస్తోంది.

Advertisement
Sai Pallavi Is Going To Be Director-Sai Pallavi : సావిత్రి వ�

ఈమెకు సినిమాలను డైరెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టమని త్వరలోనే మెగా ఫోన్ పట్టబోతున్నారని తెలుస్తోంది.

Sai Pallavi Is Going To Be Director

ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో సీనియర్ హీరోయిన్లుగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి సావిత్రి విజయనిర్మల వంటి వారందరూ కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు.అయితే వీరి బాటలోనే సాయి పల్లవి కూడా అడుగులు వేస్తున్నారు.ఈ విషయం గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.

నాకు డైరెక్షన్‌ ( Direction ) చేయాలనే ఆలోచన ఉంది.దానికోసం నా అభిరుచికీ, ఆలోచనకూ తగ్గట్టు ఓ కథ కూడా రాసుకుంటున్నాను.

ప్రస్తుతం అది నాకు ఆలోచన మాత్రమే మరి నా కథకు నిర్మాతలు ఎవరు అనేది నాకే తెలియదు నాకు తెలిసిన తర్వాత మీ అందరితో చెబుతాను అంటూ ఈమె ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?
Advertisement

తాజా వార్తలు