లక్‌ అంటే ఇదే : 10.. 20.. 30 మెగా హీరోకు అన్ని ఇలా కలిసి వచ్చాయి

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ప్రతి రోజు పండుగే సినిమాకు జస్ట్‌ యావరేజ్‌ టాక్‌ వచ్చింది.

కొందరైతే ఈ చిత్రాన్ని చెత్త సినిమా అంటూ అభివర్ణించారు.

ఇలాంటి సమయంలో ప్రతి రోజు పండుగే సినిమాకు 10 నుండి 15 కోట్ల వరకు కలెక్షన్స్‌ రావడం చాలా గొప్ప విషయం అనుకున్నారు.కాని అన్ని కూడా సాయి ధరమ్‌ తేజ్‌కు కలిసి వస్తుండటంతో ప్రతి రోజు పండుగే ఏకంగా 30 కోట్లు క్రాస్‌ చేసి 40 కోట్ల దిశగా దూసుకు పోతుంది.40 కోట్లతోనే ఆగుతుందా లేదంటే 50 కోట్ల వరకు కూడా వెళ్తుందా అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ప్రతిరోజు పండుగే సినిమా మరియు రూలర్‌ చిత్రం ఒకే రోజున వచ్చాయి.ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.కాని ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా ఉంది ప్రతి రోజు పండుగే.

అందుకే ఫ్యామిలీ ప్రేక్షకులకు మరే దిక్కు లేకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రతి రోజు పండుగే సినిమాను చూస్తున్నారు.మరో సినిమా చూసేందుకు ప్రేక్షకుల ముందు ఆప్షన్స్‌ లేవు.

Advertisement

ప్రస్తుతం సెలవులకు మరియు వీకెండ్స్‌కు ప్రతి రోజు పండుగే తప్ప మరే సినిమా లేదు.నేడు కూడా ఏ సినిమాలు విడుదల కాలేదు.

ఆ కారణంగానే ఈ చిత్రంకు వసూళ్లు పండుతున్నాయి.ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద ప్రతి రోజు పండుగే ఆడుతోంది.

ఇతర సినిమాలు చాలానే ఉన్నా ఒక్కటి కూడా కనీసం ఆకట్టుకునే విధంగా లేవు.నేడు చిన్న సినిమాలు రెండు విడుదలైన ప్రేక్షకులు వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు.

అందుకే ప్రతిరోజు పండుగే వచ్చే వారం మరియు రేపు ఎల్లుండి కూడా కుమ్మేయడం ఖాయం.అంటే 40 కోట్ల వరకు దూసుకు పోవడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?

నిజంగా లక్‌ అంటే ఈ చిత్ర యూనిట్‌ సభ్యులదే కదా.!.

Advertisement

తాజా వార్తలు