మామూలుగా సెలబ్రిటీలు బయట కనిపించారు అంటే చాలు వారు వద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తూ ఉంటారు.అలాంటప్పుడు కొంతమంది సెలబ్రిటీలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది.బాలీవుడ్లో అయితే మరీనూ, అనన్య పాండే, జాన్వీ కపూర్, అదితిరావు హైదరి లా ఎంతోమంది హీరోయిన్లు వారి ప్రియులతో అడ్డంగా దొరికిపోయారు.
అలా అప్పట్లో కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ కూడా దొరికిపోయారు.
అయితే తమ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని కోరారట.ఈ విషయాన్ని ఫోటోగ్రాఫర్స్ స్నేహ్, విశాల్ (Sneh, Vishal)వెల్లడించారు.ఒకసారి కత్రినా.తమ ఫోటోలు తీయొద్దని కోరింది.కావాలంటే నెక్స్ట్ టైమ్ పిలుస్తానని తన మేనేజర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.తర్వాత యష్ రాజ్ స్టూడియోస్‌కు రమ్మని పిలిచి నాకోసం మంచిగా ఫోటోలు దిగారు.విక్కీ కౌశల్‌తో కలిసుండగా కూడా ఫోటోలు తీశాను.
కానీ ఆమె కేవలం తన ఫోటోలు మాత్రమే తీయమంది.
మిగతావి డిలీట్ చేయమని కోరింది.ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకున్నారు.అలాగే అనన్యను కూడా ఆదిత్య రాయ్ కపూర్‌తో ఉన్నప్పుడు ఫోటోలు తీశాం.
కానీ అప్పట్లో వాటిని తను కూడా డిలీట్ చేయించింది అని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం వారు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.