విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులు చీకటిలోకి వెళ్లిపోయిన ఉక్రెయిన్..!!

రష్యా.ఉక్రెయిన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం మొదలు కావటంతో ప్రపంచం మొత్తం భయాందోళన చెందుతుంది.

ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.రష్యా సైనికులు గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్ నగరాలపై బేకరమైన దాడులు చేస్తూ ఉన్నారు.

ఆయిల్ ట్యాంక్ లు, విద్యుత్, నీటి వనరులే లక్ష్యంగా వైమానిక దాడులు మరింత ఉదృతం చేసింది రష్యా.ఉక్రెయిన్ రాజధాని కివ్ తో పాటు ఘీటోమిర్ నగరాల పైన బీకరమైన దాడులు చేస్తూ ఉంది.

ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా చేస్తున్న దాడులపై ట్విట్టర్ లో సంచలన ట్వీట్ పెట్టడం జరిగింది.రష్యా ఉగ్రవాదులు చేస్తున్న మరో దారుణమైన దాడులు.

Advertisement

యుద్ధంలో సైనిక ఓటమిని తట్టుకోలేక రష్యా ఉగ్రరూపంతో ఉక్రెయిన్ విరుచుకుపడుతోంది.తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు ఆస్కారమే లేకుండా పోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

ఇక ఇదే సమయంలో ఇరాన్ తో దౌత్య సంబంధాలు తేల్చుకునే దిశగా జెలెన్‌స్కీ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.కారణం రష్యాకు ఇరాన్ ఆత్మహుతి డ్రోన్ లను సమకూరుస్తున్నట్లు.

వాటితోనే పుతిన్ దాడులకు పాల్పడుతున్నట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.ఏది ఏమైనా రష్యా బలగాలు ఉక్రెయిన్ లో విద్యుత్ కేంద్రాలపై గత రెండు రోజులుగా దాడులకు పాల్పడటంతో.

ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలు మరికొన్ని ప్రాంతాలు అంధకారం లోకి వెళ్లిపోయాయి.

వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..
Advertisement

తాజా వార్తలు