2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ఏపీ సీఎం జగన్ దానికి అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో పాటు , రాజకీయ వ్యూహ కర్తలను ప్రాధాన్యాన్ని జగన్ మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటి వరకు వైసిపి కోసం వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేస్తూ వచ్చారు.2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో జగన్ ఎన్నికలను ఎదుర్కొన్నారు.151 సీట్లతో వైసిపి ఏపీలో అఖండ మెజారిటీని సాధించింది అంటే.దాంట్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా చాలానే ఉంది.అయితే ఆయన ప్రస్తుతం ఐ ప్యాక్ బాధ్యతల నుంచి వైదొలగడం ,దేశవ్యాప్తంగా రాజకీయంగా కీలకంగా వ్యవహరించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో, వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా ఐ ప్యాక్ సహ వ్యవస్థాపకుడు రుషిరాజ్ సింగ్ ఇప్పుడు వైసిపికి రాజకీయ వ్యూహాలు అందించబోతున్నారు.2017 నుంచి రుషి రాజ్ సింగ్ తో జగన్ కు పరిచయం వుంది .
అప్పట్లో ప్రశాంత్ కిషోర్ తో కలిసి రిషి రాజ్ వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించారు.2019 ఎన్నికల సమయంలోనూ ఐ ప్యాక్ నివేదికలపై జగన్ తో ఆయన చర్చించేవారు.ఈయన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వపు విద్యార్థి.2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ ను ప్రశాంత్ కిషోర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ గెలుపు కోసం పని చేశారు.
ఆ తర్వాత ఐ ప్యాక్ ను అనేక రాష్ట్రాల్లో విస్తరించి, అనేక ప్రాంతీయ పార్టీల గెలుపు కోసం కృషి చేయడంలో లో ఋషి రాజ్ కీలక పాత్ర పోషించారు.

2024 ఎన్నికల్లో వైసీపీకి అఖండ మెజారిటీని తీసుకొచ్చే బాధ్యతను రుషి రాజ్ స్వీకరించారు.ప్రస్తుతం ఎమ్మెల్యేల పనితీరు నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఐ ప్యాక్ టీమ్ జగన్ కు నివేదికలు అందించింది.ప్రస్తుతం ఈ నివేదికలపై అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై రిషిరాజ్ దృష్టి సారించారు.