జగన్ సిమ్లా నిర్ణయంపై బాబు టెన్షన్ ? కీలక సమావేశం ? 

జగన్ సిమ్లా టూర్ వెళ్లిన దగ్గర నుంచి టిడిపి అధినేత చంద్రబాబు లో టెన్షన్ ఎక్కువ అయినట్టుగా కనిపిస్తోంది.అసలు ఉన్నట్టు ఉండి జగన్ తన పెళ్లి రోజును పురస్కరించుకుని సిమ్లా వెళ్లడం అందరూ సాధారణంగానే చూస్తున్నా చంద్రబాబు మాత్రం ఆ కోణంలో చూడలేకపోతున్నారు.

 Jagan, Jagan Simla Tour, Tdp, Chandrababu, Ap, Tdp Polit Buro, Achhenna Naidu, A-TeluguStop.com

ఖచ్చితంగా ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆయన ఈ టూర్ పెట్టుకున్నారని దీనికి కారణాలు వెతికే పనిలో ఆయన ఉన్నారు.అయితే జగన్ మంత్రి మండలి ఏర్పాటుకు సంబంధించి లిస్టు తయారు చేసే క్రమంలోనే ఒత్తిడికి గురి కాకుండా సిమ్లా టూర్ పెట్టుకున్నట్లుగా ఓ వైపు ప్రచారం జరుగుతున్నా,  చంద్రబాబు మాత్రం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని , అందుకే దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునేందుకు పెట్టుకున్నారని అనుమానిస్తున్నారు.

ఈ మేరకు చంద్రబాబు తమ పార్టీ పొలిట్ బ్యూరో తో పాటు,  పార్టీలో తనకు అత్యంత సన్నిహితులైన సీనియర్ నాయకులతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందని, అందుకే మంత్రి వర్గంలో మార్పుచేర్పులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని , సాధారణ ఎన్నికల కంటే ఒక ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని బాబు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారట.

ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయి,  ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న చోట కొత్తగా అభ్యర్థిని ప్రకటిస్తే ఎలా ఉంటుంది ? ఇంకా పార్టీ బలపడేందుకు అవసరమైన ఏ చర్యలు తీసుకోవాలి , ఏ విధమైన ప్రణాళికతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి ఇలా అనేక అంశాల పై చర్చించారట.

Telugu Achhenna, Ap, Chandrababu, Jagan, Jagan Simla, Tdp Polit Buro-Telugu Poli

ఈ సందర్భంగా టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు తో ప్రత్యేకంగా బాబు కొన్ని విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.రాబోయే ఎన్నికల్లో సీనియర్ నాయకుల వారసులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చే అంశంపైనా చర్చ జరిగిందట.వారసులు ఏ ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది ఉన్నారు ? ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ? జనాల్లోకి వెళ్తున్నారా లేదా ఇలా అనేక అంశాల పైన బాబు ఆరా తీశారట.అలాగే పార్టీలోకి ఏ విధంగా మార్పు చేర్పులు చేయాలనే విషయాలపైన తో పాటు సీనియర్ నాయకులతో చంద్రబాబు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఏది ఏమైనా జగన్ ప్రభుత్వం కనుక ముందస్తు ఎన్నికలకు వెళితే , దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బాబు హితబోధ చేసినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube