సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలం నుంచి ప్రేమపక్షులు గా ఉన్నటువంటి నయనతార విగ్నేష్ శివన్ నేడు మూడుముళ్ల బంధంతో వారి జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలోనే నేడు మహాబలిపురంలో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇకపోతే గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట నేడు మూడుముళ్ల బంధంతో దంపతులుగా మారిన తర్వాత ఒక గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు.
ఈ విధంగా మూడుముళ్ల బంధంతో ఒకటైన నయనతార విగ్నేష్ పెళ్లి జరగగానే ఏకంగా లక్ష మంది అనాధ చిన్నారులకు బోజనాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఈ విధంగా వారి పెళ్ళికి అనాధ పిల్లలకు ఆహారం పెట్టడం వంటి గొప్ప పని చేస్తున్నారని తెలియడంతో ఈ జంటపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇప్పటికే వీరి వివాహం పూర్తి కాగా పలువురు రాజకీయ సినీ సెలబ్రిటీలు సైతం వివాహానికి హాజరైనట్టు తెలుస్తోంది.
ఇకపోతే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా ఈ జంట ఎన్నో భద్రతా చర్యలు చేపట్టారు.

వీరి పెళ్లి ఈ వేడుకను ఈ జంట ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్ ఫ్లిక్ కి అమ్మిన సంగతి తెలిసిందే అందుకే పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట నేడు పెళ్లి బంధంతో ఒకటి కావడంతో ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







