రూ. 2.3 లక్షల టిప్ అందుకున్న వెయిట్రస్... కుళ్లుకున్న రెస్టారెంట్ సిబ్బంది!

సోషల్ మీడియాలో బాగా విస్తరించిన తరువాత ఇటువంటి ఘటనలు మనం తరచుగా వింటూ విన్నాం.

మనం మన కుటుంబం లేదా ఫ్రెండ్స్ తో కలిసి హోటల్స్, రెస్టారెంట్ లకు వెళ్ళేటప్పుడు అక్కడ ఫుడ్ సర్వ్ చేసిన వారికి మహా కాకపోతే ఓ 50 రూపాయిలు ఇచ్చుకుంటాము.

కొంచెం డబ్బు అధికంగా వున్నారు ఓ 100 రూపాయిలు ఇచ్చుకుంటారు.అది కూడా మనకు ఆ సర్వీస్ నచ్చేతేనే.అయితే ఇక్కడ వైరల్ అవుతున్న న్యూస్ లో ఏకంగా ఓ సర్వర్ రూ.2.3 లక్షల టిప్ అందుకుని ఆశ్చర్యపరిచింది.అవును, ఈ కోవకు చెందిన ఘటన తాజాగా వార్తలలో నిలిచింది.

పెన్సిల్వేనియాలోని ఒక రెస్టారెంట్ లో ఈ సంఘటన జరిగింది.స్క్రాంటన్ లో ఉన్న ఆల్ఫ్రెడోస్ పిజ్జా కేఫ్‌లో మరియానా లాంబార్ట్, వెయిట్రస్ గా పనిచేస్తుంది.

ఈ క్రమంలో ఒకరోజు ఎరిక్ స్మిత్‌ కస్టమర్ వచ్చాడు.అతడు ఆమెకు.3,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.2.3 లక్షలు టిప్ గా ఇచ్చాడు.ఎరిక్ కేవలం $13.25కి ఫుడ్ ఆర్డర్ చేశారు.కానీ వెయిట్రెస్ కోసం అదనంగా 3 వేల డాలర్లు తన క్రెడిట్ కార్డ్‌పై చెల్లించారు.

Advertisement
Rs. The Waitress Who Received A Tip Of 2.3 Lakhs The Staff Of The Rotten Restaur

తను చేసిన పనికి వేల డాలర్లు ఇచ్చారని వెయిట్రస్ మరియానా లాంబెర్ట్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Rs. The Waitress Who Received A Tip Of 2.3 Lakhs The Staff Of The Rotten Restaur

ఆ తరువాత ఎరిక్ ఇది సోషల్ మీడియా ఉద్యమంలో భాగమని పేర్కొంటూ బిల్లులో టిప్స్ ఫర్ జీసస్ అని రాశారు.దాంతో ఇది కాస్తా వివాదాస్పదం అయింది.ఈ క్రమంలో రెస్టారెంట్ ప్రతినిధులు సోషల్ మీడియాలో ద్వారా స్మిత్‌ను కలుసుకున్నారు.ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.3 నెలలు కావస్తున్నా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు.ఇంతలో, మేనేజర్ వెయిట్రెస్‌ని డబ్బుకు అర్హమైన కష్టపడి పనిచేసే వ్యక్తిగా అభివర్ణించాడు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిజీ రోడ్డుపై రాంగ్ రూట్‌లో పిల్లాడు బైక్ రైడింగ్.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి!
Advertisement

తాజా వార్తలు