ఆర్ఆర్ఆర్ ఓటిటి డేట్ కన్ఫర్మ్.. అఫీషియల్ అనౌన్స్..

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

Advertisement
RRR OTT Release Date Details, Jr NTR, Ram Charan, RRR, OTT , Rrr Ott Release, Di

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.టాక్ తో పని లేకుండానే బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.

అయితే ఇంత ఘన విజయం సాధించిన ఈ సినిమా ఎప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ మీద వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.ఈ సినిమా కోసం ఎదురు చూసే అభిమానులకు టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.

Rrr Ott Release Date Details, Jr Ntr, Ram Charan, Rrr, Ott , Rrr Ott Release, Di

ఆర్ ఆర్ ఆర్ ఓటిటి డేట్ ఫిక్స్ చేసింది.ఈ సినిమా రిలీజ్ అయినా తర్వాత 100 రోజులకు ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయాలని రాజమౌళి ముందుగానే కండిషన్ పెట్టాడు.అయితే ఇప్పుడు ఈ కండిషన్ మార్చుకున్నారు.

Rrr Ott Release Date Details, Jr Ntr, Ram Charan, Rrr, Ott , Rrr Ott Release, Di

ఈ సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటిటి లోకి తీసుకు రానున్నారు. మే 20 నుండి ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ కానున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఈ సినిమా జీ5, నెట్ ఫ్లిక్స్ లలో అందుబాటులో ఉంటుంది.దీనిపై అధికారిక ప్రకటన రావడంతో ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు