ఆర్ఆర్ఆర్ మూవీ వల్ల నిర్మాతలకు అన్ని రూ.కోట్ల లాభమా.. 50 డేస్ సెంటర్లు ఎన్నంటే?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా ఆలస్యంగా థియేటర్లలో విడుదలైనా ప్రేక్షకులు ఏ మాత్రం ఫీల్ కారనే సంగతి తెలిసిందే.

రాజమౌళి మూడు, నాలుగేళ్ల పాటు సినిమాను తెరకెక్కించినా ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కేలానే సినిమా ఉంటుంది.

రాజమౌళితో సినిమాలను నిర్మించిన ఏ నిర్మాత కూడా దాదాపుగా నష్టపోలేదని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ మూవీ వల్ల నిర్మాతలకు 150 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చినట్టు సమాచారం.

థియేట్రికల్ కలెక్షన్ల ద్వారానే నిర్మాతలకు ఈ మొత్తం లాభంగా దక్కినట్టు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా నిర్మాత దానయ్యకు 200 కోట్ల రూపాయలకు పైగా లాభం వచ్చిందని ప్రచారం జరిగింది.

ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో లాభాలను అందించిన సినిమా మాత్రం ఆర్ఆర్ఆర్ మాత్రమే అని చెప్పాలి.మరోవైపు ఈ సినిమా షిప్ట్ ల వారీగా 50 రోజుల పాటు 500 కేంద్రాలలో ప్రదర్శితం అయిందని సమాచారం అందుతోంది.

Rrr Movie Rare Achievement Details Here Goes Viral ,rrr Movie,ram Charan,ntr,raj
Advertisement
RRR Movie Rare Achievement Details Here Goes Viral ,RRR Movie,Ram Charan,NTR,Raj

ఈ మధ్య కాలంలో ఇన్ని కేంద్రాలలో 50 రోజుల పాటు ప్రదర్శించబడిన సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమే కావడం గమనార్హం.తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా విజయవంతంగా ప్రదర్శించబడటం వల్లే ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఈ అరుదైన ఘనత చేరిందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సక్సెస్ అటు చరణ్ కెరీర్ కు ఇటు ఎన్టీఆర్ కెరీర్ కు ఎంతో ప్లస్ అయింది.

ఆర్ఆర్ఆర్ మూవీ రన్ థియేటర్లలో దాదాపుగా ముగిసినట్లేనని చెప్పవచ్చు.మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ లలో ఒకటైన జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కానుంది.

అధిక టికెట్ రేట్ల వల్ల థియేటర్లలో ఒక్కసారి మాత్రమే చూసిన ప్రేక్షకులు ఓటీటీలో ఎక్కువసార్లు ఈ సినిమాను చూడవచ్చని భావిస్తుండటం గమనార్హం.ఆర్ఆర్ఆర్ హిందీలో మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు